Facebook | నిలిచిపోయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు
Facebook | ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ సమస్యల కారణంగా దాదాపు అరగంట నుంచి సేవలు స్తంభించిపోయాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వాటంతటవే లాగ్ ఔట్ అయిపోయాయి. లాగిన్ అవ్వడానికి మళ్లీ ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో యూజర్లు అయోమయానికి గురవుతున్నారు. వాట్సాప్ సేవల్లోనూ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Facebook | ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా అరగంట నుంచి మెటా సేవలు స్తంభించిపోయాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వాటంతటవే లాగ్ ఔట్ అయిపోయాయి. మళ్లీ లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అవ్వకపోవడంతో యూజర్లు అయోమయానికి గురవుతున్నారు. అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. ఫేస్బుక్/ఇన్స్టాగ్రామ్ యాప్ క్రాష్ అయ్యి ఉండొచ్చని యూజర్లు కంగారుపడ్డారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని ట్విట్టర్ వేదికగా తమకు ఎదురైన సమస్యలను వివరిస్తున్నారు. వీటికి #facebookdown, #instagramdown హ్యాష్‌ట్యాగ్స్ జోడించడంతో అవి సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
ఈ సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది ఫేస్బుక్ యూజర్లు, 47వేల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ సేవల్లోనూ పలు అంతరాయాలు ఎదురైనట్లుగా సమాచారం. కాగా, ఈ సమస్యపై ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఇంతవరకు స్పందించలేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Meta
- Server down
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

