Meta Layoffs | మార్క్ జుకర్‌బర్గ్ ప్రశంసించిన టెకీపై మెటా వేటు
ఆర్ధిక మందగమనం వెంటాడటంతో పాటు మాంద్యం భయాలతో టెక్ దిగ్గజాలు ఎడాపెడా కొలువుల కోతకు (Meta Layoffs) తెగబడుతున్నాయి. వరుస లేఆఫ్స్‌తో ఉద్యోగులపై వేటు వేస్తుండటంతో ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందోనని టెకీలు వణుకుతున్నారు.
న్యూయార్క్ : ఆర్ధిక మందగమనం వెంటాడటంతో పాటు మాంద్యం భయాలతో టెక్ దిగ్గజాలు ఎడాపెడా కొలువుల కోతకు (Meta Layoffs) తెగబడుతున్నాయి. వరుస లేఆఫ్స్‌తో ఉద్యోగులపై వేటు వేస్తుండటంతో ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందోనని టెకీలు వణుకుతున్నారు. సామర్ధ్యం ఆధారంగానే లేఆఫ్స్ ఉంటాయని పైకి కంపెనీలు చెబుతున్నా కొలువుల కోతలో అత్యంత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులూ వేటుకు గురవుతున్నారు.
ఈ ఏడాది మేలో 6000 మంది ఉద్యోగులను మెటా తొలగించగా ఆ జాబితాలో పేరున్న మహిళా టెకీ ఇటీవల లింక్డిన్లో తన స్టోరీని రాసుకొచ్చారు. తాను కంపెనీలో టాప్ పెర్ఫామర్లలో ఒకరినే కాకుండా స్వయంగా మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రశంసలు పొందానని ఆమె రాసుకొచ్చారు. మెటాలో తాను ప్రాడక్ట్ మార్కెటింగ్ మేనేజర్‌గా చేరానని, ఏడాదిన్నర తర్వాత తనతో పాటు 6000 మంది ఉద్యోగులను తొలగించారని వాపోయారు.
తాను పలు కీలక ప్రాజెక్టుల్లో పనిచేయడంతో పాటు కంపెనీ టాప్ పెర్ఫామర్‌గా నిలిచానని, పైగా కంపెఈన సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ నుంచి ప్రశంసలు పొందడంతో తన ఉద్యోగానికి ఢోకా ఉండదని భావించానని ఆమె తన అనుభవాలను లింక్డిన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. మెటా లేఆఫ్స్‌లో కొలువు కోల్పోవడంతో ఇప్పుడు తాను మరో ఉద్యోగ వేటలో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.
Read More :
Prithvi Shaw | కిందపడుతుంటే ఎవరూ పట్టించుకోరు.. పృథ్వీషా ఆసక్తికర ఇన్‌స్టా స్టోరీ
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

