బుధవారం 05 ఆగస్టు 2020
Science-technology - Jul 07, 2020 , 21:03:39

డీఆర్‌డీవో - ఐఐటీహెచ్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు

       డీఆర్‌డీవో - ఐఐటీహెచ్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు

దేశ రక్షణ విభాగంలో సాంకేతిక అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేయడానికి డీఆర్‌డీవో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజషన్‌ (డీఆర్‌డీవో) కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌  ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)- హైదరాబాద్‌ రీసెర్చ్‌ సెల్‌ (పరిశోధన కేంద్రం) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

ఈ డీఆర్‌డీవో- ఐఐటీహెచ్‌ రీసెర్చ్‌ సెల్‌ రక్షణ శాఖకు సంబంధించాన సాంకేతిక అంశాలపై ప్రాథమిక పరిశోధనకు తోడ్పాటు అందించనుంది. ఈ రీసెర్చ్‌ సెల్‌ ఏర్పాటుకు సంబంధించి తాజాగా  ఇరు పక్షాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.

కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఎంవోయూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రీసెర్చ్‌ సెల్‌ ఏర్పాటుతో రక్షణ సాంకేతిక విభాగంలో హైదరాబాద్‌ కీలకంగా మారనుంది. 

ప్రధాన పరిశోధనాంశాలు :

  • అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్‌ అండ్‌ ప్రాసెసింగ్‌
  • సెన్సార్స్‌ ఫర్‌ డిఫిన్స్‌ అప్లికేషన్స్‌ 
  • హార్డ్‌వేర్‌ అండ్‌ అల్గారిథమ్స్‌ ఫర్‌ ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌ బేస్డ్‌ అప్లికేషన్స్‌
  • టెక్నాలజీస్‌ ఫర్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌
  • అడాప్టివ్‌ ఆప్టిక్స్‌ అండ్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌
  • క్వాంటమ్‌ టెక్నాలజీస్‌
  • యూఏవీ అండ్‌ Nanoornithocopter టెక్నాలజీస్‌


logo