శుక్రవారం 05 మార్చి 2021
Science-technology - Jan 25, 2021 , 17:38:20

విజ‌య‌వంతంగా ఆకాశ్-NG క్షిప‌ణి ప‌రీక్ష‌

విజ‌య‌వంతంగా ఆకాశ్-NG క్షిప‌ణి ప‌రీక్ష‌

న్యూఢిల్లీ: ‌భార‌త ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అకాశ్-NG (న్యూ జ‌న‌రేష‌న్‌) క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిప‌ణి ప‌రీక్ష నిర్వ‌హించారు. ఆకాశ్‌-NG అనే ఈ కొత్త త‌రం క్షిప‌ణి.. భార‌త వాయుసేన ఉప‌రిత‌లం నుంచి గ‌గ‌న త‌లంలోని శ‌త్రుదేశాల‌కు సంబంధించిన టార్గెట్‌ల‌ను చేధించ‌డానికి తోడ్ప‌డుతుంది. ఈ క్షిప‌ణి ప‌రీక్ష‌లో అకాశ్ మిస్సైల్ త‌న‌ ల‌క్ష్యాన్ని అత్యంత క‌చ్చిత‌మైన టైమింగ్‌తో చేధించింది. క్షిప‌ణిలోని క‌మాండ్ అండ్ కంట్రోల్ సిస్ట‌మ్‌, ఆన్‌బోర్డ్ ఏవియోనిక్స్ అండ్ ఏయిరోడైన‌మిక్ కాన్ఫిగ‌రేష‌న్ స‌మర్థంగా పనిచేశాయి. ‌  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo