గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తే.. మొబైల్లో అవి యాడ్స్‌గా వస్తున్నాయా? మీ డాటా రికార్డ్ కావొద్దంటే ఇలా చేయండి
గూగుల్‌లో మనం ఏదైతే వస్తువు గురించి వెతుకుతామో.. ఆ తర్వాత నుంచి మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా అదే వస్తువుకు సంబంధించిన యాడ్స్‌నే కనిపిస్తుంటాయి.
గూగుల్‌లో మనం ఏదైతే వస్తువు గురించి వెతుకుతామో.. ఆ తర్వాత నుంచి మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా అదే వస్తువుకు సంబంధించిన యాడ్స్‌నే కనిపిస్తుంటాయి. ఉదాహరణకు మీరు.. రెయిన్ కోట్ కోసం గూగుల్‌లో వెతికారు అనుకోండి.. అప్పట్నుంచి మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా రెయిన్ కోట్ అడ్వర్టైస్మెంట్లే కనిపిస్తుంటాయి. దీన్ని చాలామందే గమనించి ఉంటారు. కానీ మరి గూగుల్‌లో సెర్చ్ చేసిన సమాచారం ఇతరులకు ఎలా తెలుస్తోంది? అలా తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? వంటి విషయాలను ఒకసారి గమనిద్దాం..

మనం చేసే ప్రతీది రికార్డు అవుతుంది
ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు.. అందులో జీమెయిల్‌తో లాగిన్ అయి గూగుల్ సేవలను వినియోగించుకుంటున్నారు. కాబట్టి గూగుల్‌లో మనం ఏం వెతికినా.. ఏం చేసినా ప్రతిదీ రికార్డు అవుతుంది. దీనికి కారణం గూగుల్‌లోని మై యాక్టివిటీ. ఇది మన బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. దీని ఆధారంగా ఆయా సంస్థలు మన ఆసక్తులకు తగ్గట్టుగా ప్రకటనలు ఇస్తుంటాయి.
గూగుల్‌లో పర్సనల్ డేటా ఉండొద్దంటే ఏం చేయాలి

గూగుల్ సెర్చ్
గూగుల్‌లో మై యాక్టివిటీ లింక్‌పై క్లిక్ చేయగానే.. గూగుల్ మై యాక్టివిటీ అనే విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోపై భాగంలో సెర్చ్ బాక్స్ ఉంటుంది. దీనిద్వారా మనం సెర్చ్ చేసిన వెబ్సైట్ల వివరాలు తెలుసుకోవచ్చు. అది కాకుండా దాని కిందనే తేదీల వారీగా మనం ఓపెన్ చేసిన వెబ్సైట్ల వివరాలు కనిపిస్తాయి. ఈ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవడం మంచిది. మామూలుగా ఈ సమాచారాన్ని డిలీట్ చేసినప్పుడు కన్ఫర్మేషన్ అడుగుతుంది. అందుకు ఓకే నొక్కి డిలీట్ చేస్తే సరిపోతుంది.

యూట్యూబ్
కేవలం వెబ్సైట్ల వివరాలే కాదు.. మనం యూట్యూబ్‌లో చూసే ప్రతి వీడియోకు సంబంధించిన సమాచారాన్ని కూడా గూగుల్ రికార్డు చేస్తుంది. దీని ఆధారంగానే మనకు కావాల్సిన వీడియోలను సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ హిస్టరీని కూడా ఈజీగానే డిలీట్ చేయొచ్చు. ఇందుకోసం యూట్యూబ్‌లోని హిస్టరీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత క్లియర్ ఆల్ సెర్చ్ హిస్టరీ, క్లియర్ వాచ్ హిస్టరీ ఆప్షన్లను ఎంచుకోవాలి. మొత్తం హిస్టరీ కాకుండా ఒకటి రెండు వీడియోలను ఎంచుకుని కూడా వాటి సమాచారాన్ని డిలీట్ చేయవచ్చు.

యాడ్స్
గూగుల్‌లో మనం సెర్చ్ చేసే ప్రతి సమాచారాన్ని ఇతర సంస్థలు తెలుసుకుంటాయి. అందుకే మన బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి. అయితే ఈ ప్రకటన సంస్థలు మన డేటాను చూడకుండా చేయవచ్చు. ఇందుకోసం ముందుగా గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ప్రైవసీ విభాగంలోకి వెళ్లి యాడ్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ మేనేజ్ యాడ్ సెట్టింగ్స్‌ను ఎంచుకుని యాడ్ పర్సనలైజేషన్ ఆప్షన్‌ను డీయాక్టివేట్ చేసుకోవాలి.

గూగుల్ మ్యాప్స్
మనం ఏయే సమయంలో ఏయే ప్రాంతాలకు వెళ్లామనే ప్రతి విషయాన్ని గూగుల్ మ్యాప్స్ యాప్ రికార్డు చేస్తూ ఉంటుంది. ఇందుకోసం గూగుల్ మ్యాప్స్‌లో టైమ్‌లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మనం వెళ్లే ప్రతి లొకేషన్‌ను స్టోర్ చేసి పెడుతుంది. అయితే టైమ్‌లైన్ లింక్ తెరిచి గూగుల్ మ్యాప్స్ హిస్టరీని మనం డిలీట్ చేయొచ్చు. అలాగే లొకేషన్ ట్రాకింగ్‌ను కూడా ఆఫ్ చేయవచ్చు. మొత్తం హిస్టరీ కాకుండా ఎంచుకున్న ఒకటి రెండు లొకేషన్ల డేటాను కూడా డిలీట్ చేసే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
గూగుల్‌లో ఫేక్ ఫోటోలను ఎలా గుర్తించాలి…?
నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో మోసాలు.. మిమ్మల్ని డబ్బులు అడిగేది మీ ఫ్రెండేనా కాదా ఇలా గుర్తించండి
వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక నుంచి డీపీలోనే స్టేటస్ చూడొచ్చు
Social Media : అక్కడ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ బ్యాన్.. కారణం ఇదే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Ads
- Google search
- tech news
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

