Online Banking: ఆన్లైన్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ లింక్స్ క్లిక్ చేశారంటే మీ అకౌంట్లో డబ్బులు గోవిందా..!
రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత జనరేషన్ పరిస్థితి ఎలా ఉందంటే.. టెక్నాలజీ లేకపోతే ఇక మనిషికి మనుగడే లేదు.. అన్నట్టుగా టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయారు. నిజానికి.. టెక్నాలజీ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. చాలా పనులు సులభతరంగా అయిపోతున్నాయి. కానీ.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఇదే టెక్నాలజీని ఉపయోగించుకొని హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. సైబర్ క్రిమినల్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్ చేస్తున్నారు.

టెక్నాలజీ గురించి ఎక్కవుగా తెలియని.. స్మార్ట్ ఫోన్ యూజర్లను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు తమను టార్గెట్ చేశారన్న విషయాన్ని యూజర్లు చాలా లేట్‌గా తెలుసుకుంటున్నారు. దీంతో పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. అకౌంట్లో వాళ్లకు తెలియకుండానే డబ్బులు మాయం అవుతున్నాయి.
సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్ లైన్ షాపింగ్ చేసే కస్టమర్లను టార్గెట్ చేస్తున్నారు. అయితే.. ఆయా కస్టమర్ల బ్యాంకు వివరాలు సైబర్ నేరగాళ్లకు ఎలా తెలుస్తున్నాయి. దాని కోసం సైబర్ నేరగాళ్లు చేసే పని.. ఫేక్ లింక్స్ లేదా ఫ్రాడ్ లింక్స్. ఆ లింక్స్‌ను పొరపాటున కూడా క్లిక్ చేశారంటే… ఇక అంతే సంగతులు. అకౌంట్లో డబ్బులు క్షణాల్లో మాయం అయిపోతాయి.
దాన్నే ఫిషింగ్ అటాక్ (Phishing Attack) అని అంటారు. సంబంధిత బ్యాంకుల నుంచి పంపిస్తున్నట్టుగా మెసేజ్‌ను తయారు చేసి.. టార్గెట్ చేసిన యూజర్లకు పంపిస్తారు. డియర్ కస్టమర్, మీ అకౌంట్ సస్పెండ్ అయింది. వెంటనే http://446bdf227fc4.ngrok.io/xxxbank ఈ లింక్ క్లిక్ చేసి కేవైసీ అప్ డేట్ చేసుకోండి.. అనే మెసేజ్‌ను, మెయిల్‌కు కానీ.. వాట్సప్‌లో కానీ.. మెసేజ్‌గా కానీ పంపిస్తుంటారు. అకౌంట్ సస్పెండ్ అయింది.. అనే మెసేజ్ చూసి కొందరు కస్టమర్లు.. నిజమే అనుకొని.. సదరు లింక్‌ను క్లిక్ చేస్తారు. దీంతో అది డమ్మీ వెబ్ సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ బ్యాంకింగ్ వివరాలు, ఇత సెన్సిటివ్ డేటా మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరించి.. అకౌంట్ నుంచి డబ్బును కాజేస్తారు.

మీ ఆధార్‌ను అప్ డేట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్‌ను అప్ డేట్ చేసుకోండి. లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. సస్పెండ్ అవుతుంది. ఇవాళే చివరి తేదీ.. అని బ్యాంకుల పేర్లతో వచ్చే ఎటువంటి మెసేజ్‌ను కానీ.. మెయిల్‌ను కానీ నమ్మకండి. మీకు ఏదైనా డౌట్ వేస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లి సమాచారం తెలుసుకోండి. లేదా బ్యాంక్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోండి.. కానీ.. సైబర్ నేరగాళ్ల వలలో మాత్రం పడకండి.
సైబర్ నేరగాళ్ల ట్రాప్ నుంచి ఎలా తప్పించుకోవాలి?
“http:// 1a4fa3e03758. ngrok [.] io/xxxbank” ఈ టైప్‌లో లింక్స్ ఉంటే అస్సలు క్లిక్ చేయకండి. అవి ఖచ్చితంగా ఫిషింగ్ లింక్సే. రాండమ్ నెంబర్స్‌తో లింక్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఫేక్ లింకే అని అర్థం చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా ఏ వెబ్సైట్లో కానీ డబ్బులకు సంబంధించిన ఏ లావాదేవీ చేసినా.. దానికి ఖచ్చితంగా HTTPS ప్రోటోకాల్ ఉండాలి. అదే సెక్యూర్డ్ ప్రోటోకాల్. అన్ని బ్యాంకులు అదే ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తాయి. కానీ.. సైబర్ నేరగాళ్లు మాత్రం.. HTTP ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తారు. లింక్ క్లిక్ చేయగానే.. ప్రోటోకాల్.. హెచ్‌టీటీపీ ఉంటే.. అది ఖచ్చితంగా ఫేక్ లింక్ అని గ్రహించాలి. ఒక్కోసారి యూఆర్ఎల్ షార్ట్నర్ ఉపయోగించి కూడా ఫిషింగ్ లింక్స్‌ను పంపిస్తుంటారు.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పేర్లతో.. బంపర్ ఆఫర్, రూపాయికే ఫోన్.. అంటూ కొన్ని లింక్స్‌ను వాట్సప్, టెలిగ్రామ్, మెయిల్స్, మెసేజ్‌ల ద్వారా షేర్ చేస్తుంటారు. రూపాయికే ఫోన్ అని చెప్పి.. ఆవేశపడి ఆయా లింక్స్‌ను క్లిక్ చేయకండి. లింక్ క్లిక్ చేయగానే.. మీ ఫోన్లో ఉన్న సెన్సిటివ్ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీ డిటెయిల్స్‌తో సైబర్ నేరగాళ్లు ఏదైనా చేయొచ్చు. అందుకే.. ఫోన్‌కు ఫార్వార్డ్ చేసే ప్రతి లింక్‌ను క్లిక్ చేస్తూ… వాళ్లు అడిగిన డేటాను ఎంటర్ చేస్తే.. సైబర్ నేరగాళ్ల టార్గెట్ మీరే అవుతారు. ఆ తర్వాత మీ అకౌంట్‌ను హ్యాకర్లు ఖాళీ చేస్తారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

