ChatGPT Plus | కొన్ని నెలలుగా పాపులరైన చాట్‌జీపీటీ (ChatGPT) భారత్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌తో ఓపెన్ ఏఐ స్టార్టప్ రూపుదిద్దిన చాట్‌జీపీటీ చాట్‌బోట్ సబ్స్క్రిప్షన్ భారత్‌లోనూ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అయితే భారత్‌లో సబ్‌స్క్రిప్షన్‌కు ‘చాట్‌జీపీటీ ప్లస్ (ChatGPT Plus) అనే పేరు పెట్టింది. లేటెస్ట్ మోడల్ జీపీటీ-4తోపాటు పూర్తిగా చాట్‌జీపీటీ చాట్‌బోట్ సేవలు అందుబాటులోకి తెస్తామని ధృవీకరించింది. భారత్‌లో చాట్‌జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ చార్జీ 20 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.1650 అన్నమాట.
గూగుల్ సెర్చింజన్‌కు పోటీగా సేవలందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలుగా వైరల్ అయిన ఏఐ టూల్.. చాట్‌జీపీటీ సబ్స్క్రిప్షన్ సర్వీసులు గత నెలలో అమెరికాలో మొదలయ్యాయి. తాజాగా భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. చాట్‌జీపీటికి ప్రజల్లో, నెటిజన్లలో ఉన్న ఆదరణను సొమ్ము చేసుకునేందుకు దాని ఫౌండర్ ఓపెన్ ఏఐ స్టార్టప్ సబ్స్క్రిప్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు యూజర్లు ఉచితంగా ప్రతి ఒక్కరికీ చాట్‌జీపీటీ సేవలు లభించేవి. పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల.. చాట్‌జీపీటీ సేవలు పొందడంలో ప్రాధాన్యం లభిస్తుంది. నూతన ఫీచర్లు తేలిగ్గా పొందడానికి వీలు కలుగుతుంది.
చాట్‌జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ పలు ప్రయోజనాలతో యూజర్ల ముంగిట్లోకి వస్తున్నది. అధిక డిమాండ్ ఉన్నా చాట్‌జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ పొందిన వారు దాన్ని యాక్సెస్ చేసుకోవడం తేలికవుతుంది. ఫ్రీ ప్లాన్‌లో గిరాకీ తక్కువగా ఉన్నప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రీ ప్లాన్ యూజర్లకు డిమాండ్ తగ్గిన తర్వాత సేవలందిస్తామని చాట్‌జీపీటీ చాట్‌బోట్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ చాట్‌జీపీటీ ఏఐ టూల్ వైరల్ అయినా కొద్దీ తరుచుగా ఫ్రీ యూజర్లకు అందుబాటులోకి రావడం లేదు. సబ్స్క్రిప్షన్ పెయిడ్ యూజర్లు శరవేగంగా స్పందించే టర్బో ఆప్టిమైడ్ లాంగ్వేజ్ మోడల్ ‘టర్బో’లో అనుసంధానమయ్యేందుకు వెసులుబాటు ఉంటుంది. పెయిడ్ యూజర్లు రెగ్యులర్ మోడ్ లేదా టర్బో మోడ్ మధ్య ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.
చాట్‌జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తన పెయిడ్ యూజర్లకు లేటెస్ట్ మోడల్ జీపీటీ-4 సేవలు అందుకోవచ్చు. ఇది ప్రస్తుతం చాట్‌జీపీటీ ప్లస్ సబ్స్క్రైబర్లకు మాత్రమే లభిస్తుంది. న్యూ ఫీచర్లు యాక్సెస్ పొందడానికి ప్రాధాన్యం కల్పిస్తారు. అంతే కాదు హయ్యర్ యూసేజ్ లిమిట్లో చాట్‌జీపీటీ ప్లస్ సేవలు పొందొచ్చు. ఒకవేళ తరుచుగా మీరు చాట్‌జీపీటీలోకి వెళ్లి పదేపదే రిక్వెస్ట్‌లు పంపడం వల్ల మీకు ‘ఎర్రర్’లు రావచ్చు. అయితే పెయిడ్ సబ్స్క్రైబర్లు తమ యూసేజ్ లిమిట్ గురించి ఆందోళన చెందనవసరం లేదు.