న్యూఢిల్లీ : ఓపెన్ ఏఐ లాంఛ్ చేసిన ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) టెక్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయడం నుంచి కవరింగ్ లెటర్లు రాయడం, కోడింగ్ సహా ఏ ప్రాబ్లమ్కైనా చిటికెలో సొల్యూషన్ సూచిస్తోన్న చాట్‌జీపీటీ వేగంగా యూజర్ల ఆదరణ పొందుతోంది. మనుషులకు సాయం చేసేందుకు ఏఐ తోడ్పడేలా చాట్‌జీపీటీని ఆవిష్కరించామని ఓపెన్ ఏఐ చెబుతుండగా ఇప్పుడు ఈ ఏఐ టూల్ ఏకంగా పలు ఉద్యోగాలకే ఎసరు పెట్టేలా ఉంది.
రెజ్యూమ్‌బిల్డర్.కాం ఇటీవల 1000 మంది బిజినెస్ లీడర్లతో మాట్లాడగా ఏఐ టూల్‌తో కొలువుల కోత తప్పదనే సంకేతాలు వెల్లడయ్యాయి. పలు కంపెనీలు ఏఐ టూల్స్‌ను ప్రవేశపెట్టి పెద్దసంఖ్యలో వర్కర్లను తొలగిస్తున్నాయి. ఉద్యోగాల కోత తప్పదనే ఆందోళన నడుమ స్వయంగా చాట్‌జీపీటీ ప్రమోటర్లు మరింత మెరుగైన న్యూ అడ్వాన్స్డ్ చాట్‌జీపీటీ-4ను ముందుకు తీసుకువచ్చింది.
న్యూ అడ్వాన్స్డ్ జీపీటీ-4 వెర్షన్ సామర్ధ్యాలపై టెస్టింగ్ జరుగుతుండగానే షాకింగ్ ఫలితాలు వచ్చాయి. జీపీటీ-4 ఏయే ఉద్యోగాలను రీప్లేస్ చేయగలదని ట్విట్టర్ యూజర్ ప్రశాంత్ రంగస్వామి ప్రశ్నించగా చాట్‌బాట్ నివ్వెరపోయే సమాధానం ఇచ్చింది. జీపీటీ-4 తాను 20 ఉద్యోగాలను రీప్లేస్ చేయగలనని బదులిచ్చింది. ఆ జాబితాను కూడా జీపీటీ-4 వెల్లడించింది. జీపీటీ-4తో కోల్పోయే ఆ ఉద్యోగాలను పరిశీలిస్తే..
డేటా ఎంట్రీ క్లర్క్
కస్టమర్ సర్వీస్ రిప్రజంటేటివ్
ప్రూఫ్ రీడర్
పారాలీగల్
బుక్‌కీపర్
ట్రాన్స్‌లేటర్
కాపీరైటర్
మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్
సోషల్ మీడియా మేనేజర్
అపాయింట్మెంట్ షెడ్యూలర్
టెలిమార్కెటర్
వర్చువల్ అసిస్టెంట్
ట్రాన్స్‌స్క్రిప్షనిస్ట్
న్యూస్రిపోర్టర్
ట్రావెల్ ఏజెంట్
ట్యూటర్
టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్
ఈమెయిల్ మార్కెటర్
కంటెంట్ మోడరేటర్
రిక్రూటర్
Read More :
ChatGPT | చాట్‌జీపీటీకి పోటీగా క్లాడ్ : ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగుల ఆవిష్కరణ
AI bot | గేమింగ్ కంపెనీ సీఈఓగా ఏఐ బాట్ నియామకం