న్యూఢిల్లీ : బడ్జెట్ ధరలో లేటెస్ట్ ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్‌ల ఎంపిక ఏమంత సులభం కాదు. రూ. 40,000లోపు ధరలో ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు మార్కెట్లో మెరుగైన ఆప్షన్లే ఉన్నాయి. స్టైలిష్ లుక్‌తో పాటు మెరుగైన పెర్ఫామెన్స్ అందించే ల్యాప్‌టాప్‌లు ఈ బడ్జెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో ల్యాప్‌టాప్‌లు గేమింగ్, వీడియో ఎడిటింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తాయి. అయితే ఈ ఫీచర్లకు సపోర్ట్ చేసే ల్యాప్‌టాప్‌ల పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం కొంత రాజీపడాల్సి ఉంటుంది.
రెగ్యులర్ ఆఫీస్ వర్క్ (ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఎక్సెల్, ఈమెయిల్స్) మూవీస్ చూడటం కోసమైతే మెరుగైన ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో కాల్స్‌తో మీ పనులు చక్కబెట్టాల్సిన అవసరం ఉంటే వెలుపల కెమెరాను అమర్చుకోవాల్సి ఉంటుంది. ల్యాప్‌టాప్‌ల ధర ఎంత ఉన్నా ఎక్కువ ల్యాప్‌టాప్‌లు పేలవమైన వెబ్క్యామ్స్తో వస్తున్నాయి. అయితే లేటెస్ట్ ప్రాసెసర్లతో కూడిన ఇంటెల్, ఏఎండీల పెర్ఫామెన్స్‌ను పరిశీలించాల్సి ఉంది. అప్పటివరకూ 10, 11 జనరేషన్-ఇంటెల్ సీపీయూ, ఎస్ఎస్డీ స్టోరేజ్, కనీసం 8జీబీ ర్యాంతో కూడిన ల్యాప్‌టాప్ కొనుగోలుపై యూజర్లు దృష్టి సారించాలి.
ఇక మెరుగైన డిస్ప్లే, బ్యాటరీకి ప్రాధాన్యత ఇచ్చేవారికి రియల్మీ బుక్ (స్లిమ్) మెరుగైన ఆప్షన్. ప్రొడక్టివిటీని కోరుకునే యూజర్లు హెచ్‌పీ 14ఎస్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ బిల్టిన్ అలెక్సా సపోర్ట్‌ను కలిగిఉంది. ఇక ఈ సెగ్మెంట్లోకి ఇన్ఫినిక్స్ కొత్తగా ఎంట్రీ ఇచ్చినా దీని ఎక్స్ఐ స్లిమ్ ల్యాప్‌టాప్ స్లీక్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. రూ. 40,000లోపు ధరలో భారత్‌లో లభించే ల్యాప్‌టాప్‌లను చూస్తే..
రియల్మీ బుక్ (స్లిమ్) రూ . 35,990
ఆసుస్ వివోబుక్ అల్ట్రా 14 రూ. 39,990
హెచ్‌పీ 14ఎస్ రూ . 37,990
ఇన్ఫినిక్స్ ఎక్స్ఐ స్లిమ్ రూ . 37,990
లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 రూ. 37,990