Army 3D House | ఇండియన్ ఆర్మీ తన తొలి 3 డీ ప్రింటెడ్ ఇంటిని ఆహ్మదాబాద్‌లో నిర్మించింది. ఈ ఇల్లు నిర్మాణం పనులను 12 వారాల్లో పూర్తి చేశారు. 765 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక అంతస్థులో ఇంటిని నిర్మించారు. ఈ ఇల్లును మైకాంబ్ (MiCoB) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో కలిసి మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) నిర్మించింది. ఆధునిక కాలంలో వేగవంతమైన నిర్మాణానికి ఈ ఇల్లు చిహ్నంగా నిలుస్తున్నది.
ఈ ఇల్లు నిర్మాణంలో అత్యాధునిక 3 డీ రాపిడ్ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించారు. 3 డీ ప్రింటెడ్ ఫౌండేషన్, వాల్, స్లాబ్ ఉపయోగించారు. అహ్మదాబాద్‌లోని ఆర్మీ గోల్డెన్ కటార్ డివిజన్ దీని నిర్మాణం పనులను పర్యవేక్షించింది. ఈ ఇంటిలో గ్యారేజీని కూడా నిర్మించారు. ఈ 3 డీ ప్రింటెడ్ ఇల్లు అందుబాటులోకి రావడంతో సైనిక సిబ్బందికి గృహాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీరగలదని అధికారులు భావిస్తున్నారు.
3 డీ ప్రింటింగ్ టెక్నాలజీ సహాయంతో 3 డైమెన్షనల్ విషయాలను తొలుత సృష్టించారు. వీటిని 3 డీ ప్రింటర్ల సాయంతో తయారయ్యాయి. 3 డీ ప్రింటెడ్ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను ఫైనలైజ్ చేసిన తర్వాత డాటాను మెషిన్‌లోకి ఫీడ్ చేయగా.. రోబోలు వస్తువులను సిద్ధం చేసే పనిని చేపడతాయి.