Whatsapp | ఈ మధ్య స్పామ్ కాల్స్ ఎక్కువైపోయాయి. మొన్నటిదాకా నార్మల్ ఫోన్ కాల్స్‌కి మాత్రమే స్పామ్ కాల్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు అది వాట్సాప్ కాల్స్‌కు కూడా పాకింది. ముఖ్యంగా అంతర్జాతీయ నంబర్ల నుంచి ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ రావడం ఇటీవల కలకలం రేపింది. దీంతో మామూలు కాల్స్‌కు డీఎన్డీ (డు నాట్ డిస్టర్బ్ ) ఆప్షన్ ఉన్నట్లే వాట్సాప్‌లో కూడా దీన్ని అమలు చేస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యూజర్ల రిక్వెస్ట్‌పై దృష్టి సారించిన మెటా.. వాట్సాప్‌లో డు నాట్ డిస్టర్బ్ తరహాలో ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ ఈ ఫీచర్ మంగళవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. సైలెన్స్ అన్నోన్ కాలర్స్ పేరిట ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని వాట్సాప్ ప్రకటించింది.
మొబైల్లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ ఫీచర్‌ను ఆన్ చేసుకుంటే తెలియని నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ డిస్ప్లే అవ్వవు. అంటే.. కాల్ వస్తున్నట్లుగా మొబైల్ స్క్రీన్‌పై కనిపించదు. అలాగే రింగ్ కూడా అవ్వదు. దీంతో అన్నోన్ నంబర్ల నుంచే వచ్చే కాల్స్ విషయంలో ఎలాంటి టెన్షన్ ఉండదు. కానీ కొన్నిసార్లు మనకు కావాల్సిన వ్యక్తులు ఇతర నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ చేసే అవకాశం లేకపోలేదు. అలాగే కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల నంబర్లు కూడా మన మొబైల్లో సేవ్ చేసుకోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో వాళ్ల కాల్స్ మిస్సయ్యే ఛాన్స్ ఉంది. అందుకే సైలెంట్ అయిన అన్ని అన్నోన్ కాల్స్‌కి సంబంధించిన వివరాలు వాట్సాప్ కాల్ లిస్ట్‌లోకి చేరే ఏర్పాటు చేసింది. దీనివల్ల అప్పుడప్పుడూ వాట్సాప్ కాల్ లిస్ట్ చెక్ చేసుకోవడం ద్వారా ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా కాల్ చేసి ఉంటే చూసుకుని తిరిగి కాల్ చేయొచ్చు.
☞ ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయగానే కుడివైపు భాగంలో మూడు చుక్కల గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
☞ సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తర్వాత అందులోని ప్రైవసీ విభాగాన్ని ఎంచుకోవాలి.
☞ ప్రైవసీ విభాగంలోని కాల్స్ ఆప్షన్ ఎంచుకుని సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనేది క్లిక్ చేసి దాన్ని ఆన్ చేసుకోవాలి.
“Whatsapp | గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే ఫోన్లో రెండు వాట్సాప్ నంబర్లు యూజ్ చేయొచ్చు!”
WhatsApp | వాటి తరహాలోనే త్వరలో వాట్సాప్ లోనూ స్క్రీన్ షేరింగ్..”
“WhatsApp Edit | ‘ఎడిట్’ ఫీచర్ ప్రారంభించిన వాట్సాప్.. మెసేజ్‌లో పొరపాటు ఎలా ఎడిట్ చేయాలంటే..?!”