Whatsapp | గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే ఫోన్లో రెండు వాట్సాప్ నంబర్లు యూజ్ చేయొచ్చు!
Whatsapp | గూగుల్, ఫేస్బుక్ తరహాలో ఒకేసారి వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లను వాడుకునే సదుపాయాన్ని మెటా తీసుకొస్తోంది. వాట్సాప్ తాజాగా విడుదల చేసిన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ ( 2.23.13.5) లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని వాట్సాప్ బీటాఇన్ఫో వెల్లడించింది.
Whatsapp | జియో పుణ్యమా అని ఇప్పుడు చాలామంది రెండు సిమ్‌లు వాడుతున్నారు. ఎలాగూ మార్కెట్లో దొరికే ఫోన్లు అన్నీ డ్యుయెల్ సిమ్ ఫెసిలిటీ ఉండటంతో దాదాపు అందరూ రెండు నంబర్లను వాడుతున్నారు. కానీ వాటిలో ఏదో ఒక నంబర్‌కు మాత్రమే వాట్సాప్ వాడుతున్నారు. ఇందుకు కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంట. మొబైల్లో ఒక వాట్సాప్ నంబర్‌ను మాత్రమే వాడే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఎవరికైనా నంబర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కాలింగ్‌కు ఒకటి, వాట్సాప్‌నకు మరొకటి చెప్పాల్సి వస్తుంది. అలా కాదనుకుంటే థర్డ్ పార్టీ నుంచి వాట్సాప్ క్లోనింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇది ఎంతవరకు సేఫ్టీ అనేది తెలియదు. దీనివల్ల పలు సందర్భాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇకపై ఆ ఇబ్బందులు ఏమీ పడాల్సిన అవసరం లేదు. గూగుల్, ఫేస్బుక్ తరహాలో ఒకేసారి ఒక యాప్‌లో రెండు అకౌంట్లను వాడుకునే సదుపాయాన్ని మెటా తీసుకొస్తోంది.
📝 WhatsApp beta for Android 2.23.13.5: what’s new?
Thanks to the business version of the app, we discovered that WhatsApp is working on a multi-account feature, and it will be available in a future update of the app!https://t.co/jDnLxnJtbv pic.twitter.com/kz4PrYbCvX
— WABetaInfo (@WABetaInfo) June 14, 2023
వాట్సాప్ తాజాగా విడుదల చేసిన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ ( 2.23.13.5) లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని వాట్సాప్ బీటాఇన్ఫో వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉందని.. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు కొన్ని స్క్రీన్‌షాట్స్ షేర్ చేసింది. వాటి ప్రకారం రెండు నంబర్లు లేదా అంతకంటే ఎక్కువ నంబర్లను ఒకే వాట్సాప్ యాప్‌లో ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఇది వాట్సాప్ బిజినెస్ యాప్‌లోనే ఉంది. రెగ్యులర్ యాప్‌లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Read More :
WhatsApp | వాటి తరహాలోనే త్వరలో వాట్సాప్ లోనూ స్క్రీన్ షేరింగ్..”
“WhatsApp Edit | ‘ఎడిట్’ ఫీచర్ ప్రారంభించిన వాట్సాప్.. మెసేజ్‌లో పొరపాటు ఎలా ఎడిట్ చేయాలంటే..?!”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

