iPhone | చవకైన ఐఫోన్ మోడల్‌పై యాపిల్ కసరత్తు..2024 ఫస్ట్ హాఫ్‌లో లాంఛ్!
నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఐఫోన్ సిరీస్ ఐఫోన్ 15పై కసరత్తు సాగిస్తున్న యాపిల్ వచ్చే ఏడాది చవకైన ఐఫోన్‌ను (iPhone) ప్రవేశపెట్టేందుకూ సన్నాహాలు చేపట్టింది.
న్యూఢిల్లీ : నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఐఫోన్ సిరీస్ ఐఫోన్ 15పై కసరత్తు సాగిస్తున్న యాపిల్ వచ్చే ఏడాది చవకైన ఐఫోన్‌ను (iPhone) ప్రవేశపెట్టేందుకూ సన్నాహాలు చేపట్టింది. ఐఫోన్ 15 సిరీస్ ఈ ఏడాది చివరిలో కస్టమర్ల ముందుకు రానుండగా ఆపై వచ్చే ఏడాది చవక ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడంపై యాపిల్ దృష్టి సారించనుంది.
ఐఫోన్ ఎస్ఈ 4ను చవక మోడల్‌గా 2024లో యాపిల్ కస్టమర్ల ముందుకు తీసుకురానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ 4 2024 ప్రధమార్ధంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐఫోన్ ఎస్ఈ 4 లాంఛ్‌పై కంపెనీ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా అప్‌కమింగ్ ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఫీచర్లపై పలు లీకులు వెల్లడయ్యాయి.
లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఐఫోన్ ఎస్ఈ 4 బీఓఈ సరఫరా చేసిన 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. డిజైన్ విషయంలో నెక్ట్స్ ఐఫోన్ ఎస్ఈ మోడల్లో యాపిల్ భారీ మార్పులు చేపట్టనుంది. ఐఫోన్ ఎస్ఈ 4 ఐఫోన్ 14 తరహా డిజైన్‌ను కలిగిఉంటుందని చెబుతున్నారు. ఐఫోన్ ఎస్ఈ 4 డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో ఆకట్టుకోనుంది. ఇక లేటెస్ట్ ఎస్ఈ 4 ఏ15 బయోనిక్ చిప్సెట్తో రానుంది. ఐఫోన్ ఎస్ఈ 4 ధర దాదాపు రూ. 50,000 ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More :
Best 5G phones | రూ. 30,000లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..!
Best smartwatches | రూ. 5000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల కోసం చూస్తున్నారా..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

