న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ల తరహాలోనే స్మార్ట్‌వాచ్‌ల (Best smartwatches) విషయంలోనూ అందుబాటు ధరలో మెరుగైన ఫీచర్లు కలిగిన డివైజ్‌ల కోసం కస్టమర్లు అన్వేషిస్తుంటారు. భారీ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, మెరుగైన టచ్ రెస్పాన్స్, బెస్ట్ బ్యాటరీ లైఫ్ కలిగిన స్మార్ట్‌వాచ్‌లు అందుబాటు ధరలో లభిస్తే కస్టమర్లు ఆయా స్మార్ట్‌వాచ్‌ల కొనుగోలుకు మొగ్గుచూపుతుంటారు.
రూ. 5000లోపు ఫీచర్లతో రాజీపడకుండా బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నాయిస్ కలర్‌ఫిట్ ప్రొ 4 రూ. 5000లోపు మెరుగైన స్మార్ట్‌వాచ్‌ల్లో ఒకటిగా టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
రూ. 2000లోపు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కలిగిన స్మార్ట్‌వాచ్ కోరుకునే వారు సెన్స్ ఎడిసన్ 1 ఎంచుకోవచ్చు.మెరుగైన టచ్ రెస్పాన్స్, అద్భుతమైన అమోల్డ్ డిస్ప్లే కోసం వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌ను ఎంచుకోవచ్చు. ఎక్కవు డబ్బు వెచ్చించకుండానే మెరుగైన ఫీచర్లతో లభించే స్మార్ట్‌వాచ్‌లు ఇవే..
నాయిస్ కలర్‌ఫిట్ ప్రొ 4 రూ . 2999
ఫైర్‌బోల్ట్ రాకెట్ రూ . 2,499
సెన్స్ ఎడిసన్ 1 రూ. 1699
రియల్‌మి టెక్లైఫ్ వాచ్ ఆర్100 రూ. 3999
వన్‌ప్లస్ నార్డ్ వాచ్ రూ. 4999
Read More :