boAt Wave Flex | రూ. 1500కే లేటెస్ట్ ఫీచర్లతో బోట్ వేవ్ ఫ్లెక్స్ స్మార్ట్‌వాచ్ లాంఛ్
అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాయి. ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ బోట్ భారత్‌లో న్యూ స్మార్ట్‌వాచ్ బోట్ వేవ్ ఫ్లెక్స్ ( boAt Wave Flex) స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది.
న్యూఢిల్లీ : అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాయి. ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ బోట్ భారత్‌లో న్యూ స్మార్ట్‌వాచ్ బోట్ వేవ్ ఫ్లెక్స్ ( boAt Wave Flex) స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ సహా పలు లేటెస్ట్ ఫీచర్లతో మోస్ట్ అఫర్డబవుల్ స్మార్ట్‌వాచ్‌గా ఇది కస్టమర్ల ముందుకొచ్చింది.
ఈ స్మార్ట్‌వాచ్ బ్యాటరీ లైఫ్ పదిరోజుల వరకూ ఉంటుందని కంపెనీ తెలిపింది. భారీ డిస్ప్లేతో ఈ స్మార్ట్‌వాచ్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. బోట్ వేవ్ ఫ్లెక్స్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ యాక్టివ్ బ్లాక్, చెర్రీ బ్లాజమ్, డీప్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉండగా దీని ధర రూ. 1499. యాక్టివ్ లైఫ్‌స్టైల్‌తో కూడిన యువతకు ఈ స్మార్ట్‌వాచ్ మెరుగైన ఛాయిస్‌గా నిలుస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్‌ను బోట్-లైఫ్‌స్టైల్.కాం, ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. బోట్ వేవ్ ఫ్లెక్స్ 1.83 ఇంచ్ హెచ్డీ డిస్ప్లేతో క్రిస్టల్ క్లియర్ విజువల్స్ అందించడంతో పాటు నోటిఫికేషన్స్, యాప్స్‌ను సులభంగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ క్లాసీ మెటాలిక్ డిజైన్, సాఫ్ట్, స్కిన్ ఫ్రెండ్లీ వైబ్రాంట్ కలర్స్‌తో కూడిన స్ట్రాప్స్‌తో ఆకట్టుకుంటుంది. ఫ్యాషన్, ఫంక్షన్ల మేలి మేళవింపుగా బోట్ వేవ్ ఫ్లెక్స్ కస్టమర్లను ఆకర్షిస్తుంది.
Read More :
Naya Mall | ఈ పెన్ను ధర రూ.22.74 లక్షలు.. అంతలా దీని స్పెషాలిటీ ఏంటో !!
I-Phone Discounts | ఆపిల్ ప్రియులకు `హోలీ` ఆఫర్.. డిస్కౌంట్‌పై ఐ-ఫోన్లు.. ఇవీ డిటైల్స్!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

