I-Phone Discounts | ఆపిల్ ప్రియులకు `హోలీ` ఆఫర్.. డిస్కౌంట్‌పై ఐ-ఫోన్లు.. ఇవీ డిటైల్స్!
I-Phone Discounts | హోలీ పండుగ సందర్భంగా ఐ-ఫోన్13తోపాటు పలు ఐ-ఫోన్లపై ఆపిల్ డిస్కౌంట్ ధరలకు మొబైల్ ఫోన్ ప్రియులకు అందుబాటులోకి తెచ్చింది.
I-Phone Discounts | ఆపిల్ ఐ-ఫోన్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ఐ-ఫోన్ 13.. హోలీ పర్వదనం సందర్భంగా ఆఫర్ ప్రకటించింది. రెండేండ్ల క్రితం 2021లో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన ఈ ఫోన్ రూ.49,099లకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.79,900. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్ మార్చి ఆరో తేదీ వరకు ఉంటుంది. ఏ-15 బయోనిక్ చిప్, 6.1-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇతర ఐ-ఫోన్ మోడల్ ఫోన్లపై కూడా ఆపిల్ ఆఫర్లు ప్రకటించింది.
ఇవీ ఐ-ఫోన్లపై డిస్కౌంట్లు.. రాయితీలు..
- ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు, యూపీఐ లావాదేవీల్లో బుక్ చేసుకున్న వారు అదనపు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
- ఇప్పటికే వాడిన ఐఫోన్-12, ఐఫోన్11, ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్ ఫోన్ల ఎక్స్చేంజ్తోనూ డిస్కౌంట్ రేట్‌తో ఐ-ఫోన్13 కొనుగోలు చేయొచ్చు.
- 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఐ-ఫోన్13 నాలుగు వేరియంట్లు- ఓపెన్ బాక్స్, సూపర్బ్, గుడ్, ఫెయిర్ వేరియంట్లలో లభ్యం.
- ఫెయిర్ వేరియంట్ రూ.46,699, సూపర్బ్ వేరియంట్ రూ.51,699లకు కొనుగోలు చేయొచ్చు.
- యూపీఐ ట్రాన్సాక్షన్లతో బుక్ చేసుకుంటే రూ.3,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్.
- వివిధ బ్యాంకుల డెబిట్/ క్రెడిట్ కార్డులు, నెట్‌బ్యాంకింగ్ ద్వారా మరో రూ.2000 తగ్గింపు.
డిస్కౌంట్‌పై లభించే ఇతర ఐ-ఫోన్ల వివరాలిలా..
- ఐ-ఫోన్ 11 అసలు ధర రూ.64,900 కాగా, రూ.27,699లకే లభ్యం.
- ఐ-ఫోన్ 12 ధర రూ.79,900 కాగా, రూ.36,699లకే కొనుగోలు చేయొచ్చు.
- ఐ-ఫోన్-8 ఫోన్ రూ.64వేలు కాగా, రూ.13,299లకే లభ్యం.
- ఐ-ఫోన్ ఎక్స్ఆర్ ఫోన్ అసలు ధర రూ.76,900.. డిస్కౌంట్‌పై రూ.20,499లకు లభ్యం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

