న్యూఢిల్లీ : ఐఫోన్ 14 సిరీస్‌లో నాలుగు మోడల్స్‌ను యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంఛ్ చేయనుంది. ఐఫోన్ 14 మోడల్స్ వివరాలు, లాంఛ్ డేట్‌పై యాపిల్ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించకముందే ఈ మోడల్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌పై పలు లీకులు వెల్లడయ్యాయి.
ఇక యాపిల్ తన సేల్స్ వ్యూహాన్ని మారుస్తోందని తాజా నివేదిక ముందుకొచ్చింది. సూపర్ ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్‌ను విస్తరించే క్రమంలో హైఎండ్ ఐఫోన్ 14 ప్రొ సేల్స్‌పై యాపిల్ దృష్టి సారించనుందని టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ మింగ్- చి కూ వెల్లడించారు. ఇది వన్‌టైం ప్లాన్ కాదని, ఐఫోన్ 15 సిరీస్ సహా రాబోయే ఐఫోన్ మోడల్స్కూ ఇదే వ్యూహం అనుసరిస్తుందని కూ పేర్కొన్నారు.
ఈ ఏడాది లాంఛ్ కానున్న ఐఫోన్ ప్రొ మోడల్స్ చవకైన మోడల్స్ కంటే విభిన్న లుక్‌లో ఉంటాయని చెబుతున్నారు. ఈ సెప్టెంబర్‌లో యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లను లాంఛ్ చేస్తోంది. ఈ మోడల్స్ పిల్ షేప్డ్ డిజైన్‌తో ఆకట్టుకుంటాయని లీకుల్లో వెల్లడైంది. ఈ నాలుగు మోడల్స్ ఏ16 బయోనిక్ చిప్సెట్తో ఐఓఎస్ 16 ఓఎస్‌పై రన్ అవుతాయి.