Apple iPhone 13 : సెప్టెంబర్‌లో ఐఫోన్ 13 లాంచ్.. లీకైన ఫీచర్లు ఇవే
ప్రస్తుతం ఐఫోన్ 12 సిరీస్ మార్కెట్లో ఉంది. అయితే.. సరికొత్త ఫీచర్లతో త్వరలోనే యాపిల్ కంపెనీ.. ఐఫోన్ 13 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. వచ్చే సెప్టెంబర్ నెలలోనే ఐఫోన్ 13ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 13 సిరీస్‌లో భాగంగా.. వెనీలా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ఓ 13 ప్రో మాక్స్ మోడల్స్‌ను యాపిల్ రిలీజ్ చేయనుంది.

గత సంవత్సరం కూడా సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 12 సిరీస్‌ను యాపిల్ రిలీజ్ చేయాలని భావించినా.. కరోనా కారణంగా దాని లాంచ్ వాయిదా పడింది. ఒక నెల లేట్‌గా ఐఫోన్ 12 సిరీస్‌ను లాంచ్ చేశారు. ఈ సంవత్సరం ఐఫోన్ 13 సిరీస్‌ను ఎలాగైనా సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక.. ఐఫోన్ 13 ఫీచర్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ.. ఈ రెండు మోడల్స్‌లో వెనుక భాగంలో డ్యుయల్ కెమెరాలు, ప్రో మోడల్స్‌లో ట్రిపుల్ కెమెరాలు ఉంటాయట. లేజర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ లాంటి ఫీచర్లు సాధారణంగా అన్ని మోడల్స్‌తో పాటు వచ్చేవే. అయితే.. ఐఫోన్ 13 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో మాత్రం లైడార్ సెన్సార్ ఫీచర్ ఉండనుంది. ఇది వరకు వచ్చి ప్రో మోడల్స్ లోనూ ఇదే సెన్సార్ ను ప్రొవైడ్ చేశారు.
13 మోడల్స్ అన్నీ 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఐపాడ్ ప్రో 2020, 2021 మోడల్స్‌లో ఉపయోగించారు. దాన్నే ప్రో డిస్ప్లే అని అంటారు. ఇక నుంచి విడుదలయ్యే నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ మోడల్స్ అన్నీ ఏ15 బయోనిక్ చిప్సెట్, ఏవోడీ.. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే.. అనే మోడ్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. బ్యాటరీకి ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా ఏవోడీ, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌ను సాధించడం కోసం.. యాపిల్ ఫోన్లలో పవర్ ఎఫిషియెంట్ ఎల్టీపీవో డిస్ప్లేను కంపెనీ ఉపయోగిస్తోంది. వేగంగా ఫోన్ చార్జ్ అవడం కోసం.. లైట్నింగ్ పోర్ట్ బదులు.. యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌ను మళ్లీ కంపెనీ తీసుకురానుంది.
5జీ కనెక్టివిటీ సపోర్ట్‌తో పాటు.. వైఫై 6ఈ, రెండు కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ రానుంది. ఇప్పటికే.. 90 మిలియన్ అంటే 9 కోట్ల ఐఫోన్ 13 ఫోన్లను తయారు చేసేందుకు తమ సప్లయర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ మూడో వారంలో ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ చేసేందుకు యాపిల్ సంస్థ సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

