Amazon Layoffs | ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు నేపథ్యంలో గ్లోబల్ టెక్ దిగ్గజాలు పొదుపు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్ సిబ్బందికి ఉద్వాసన పలికాయి. ఆ జాబితాలో అమెజాన్ వచ్చి చేరింది. నాన్ – ప్రాఫిటబుల్ బిజినెస్‌ల నిర్వహణను అమెజాన్ సమీక్షిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వార్తా కథనం ప్రచురించింది. నాన్ – ప్రాఫిటబుల్ బిజినెస్‌ల జాబితాలో వాయిస్ అసిస్టెంట్ అలెక్స్ కూడా వచ్చి చేరింది. అమెజాన్‌లో ‘రోబోటిక్స్’ టీమ్‌నే పూర్తిగా తీసేసినట్లు జమీ జంగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన లింక్డ్ ఇన్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారం చెబుతున్నది.
రోబోటిక్స్ టీమ్‌లో 3500 మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నట్లు లింక్డ్ ఇన్‌లో జమీ జంగ్ షేర్ చేసిన సమాచారం ప్రకారం తెలుస్తున్నది. దీనికి సంబంధించి అమెజాన్ యాజమాన్యం నుంచి ఎటువంటి వివరణ లేకపోవడం గమనార్హం.
అలెక్సా బిజినెస్ తీరు తెన్నులను సునిశితంగా పరిశీలిస్తున్న అమెజాన్.. వాయిస్ అసిస్టెంట్‌కు నూతన జవసత్వాలు కల్పించే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొన్ని నిర్దిష్ట విభాగాల్లో అధిక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందని, దీన్ని అత్యధిక కస్టమర్లకు ఉపయోగపడేలా తీర్చి దిద్దాలని అమెజాన్ యోచిస్తున్నది.
అంతే కాదు అన్ప్రాఫిటబుల్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులను వేరే చోట ఉద్యోగాలు వెతుక్కోవాలని అమెజాన్ సూచించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తాకథనం సారాంశం. దీని ప్రకారం త్వరలో పలు ప్రాజెక్టులను మూసివేయడం గానీ, తాత్కాలికంగా సస్పెండ్ చేయడం గానీ చేయొచ్చునని అంచనా.
కొత్త నియామకాలపై నిషేధం విధించినా.. మానివేసిన ఉద్యోగుల స్థానంలో టార్గెటెడ్ ప్రాజెక్టుల కోసం మాత్రం కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నది. ఈ మేరకు కంపెనీ పీపుల్ ఎక్స్‌పీరియెన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెథ్ గలేట్టి.. సిబ్బందికి మెమో జారీ చేశాడు. అనూహ్య మైక్రో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నియామకాలు, ఇన్వెస్ట్మెంట్లను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.