Amazon Great Indian Festival Sale 2025 | దసరా పండుగ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఈ సేల్‌ను ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు ధరలను అందించనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్, కిచెన్, ఔట్ డోర్ ఉత్పత్తులపై 80 శాతం వరకు, నిత్యావసరాలపై 70 శాతం, టీవీలు, ఇతర గృహోపకరణాలపై 65 శాతం వరకు, అమెజాన్ ఫ్రెష్, ఎకో అలెక్సా, ఫైర్ టీవీ, కిండిల్ ఉత్పత్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందించనున్నట్లు తెలిపారు. శాంసంగ్, యాపిల్, ఇంటెల్, హెచ్‌పీ, అసుస్, టైటాన్, లైబాస్, లోరియల్ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన దాదాపు 30వేలకు పైగా ఉత్పత్తులపై రాయితీలను అందిస్తున్నట్లు తెలియజేశారు.
ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌కు చెందిన ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను పొందవచ్చు. వన్ ప్లస్ 13 అసలు ధర రూ.69,999 ఉండగా, ఈ సేల్‌లో ఈ ఫోన్ ను రూ.57,749కి కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 13ఆర్ స్మార్ట్ ఫోన్‌ను రూ.35,749 ధరకు, 13ఎస్ ఫోన్‌ను రూ.47,749కి, వన్ ప్లస్ నార్డ్ 5 ఫోన్‌ను రూ.28,499 ధరకు కొనవచ్చు. అలాగే వన్ ప్లస్ నార్డ్ సీఈ5 ఫోన్ ధర రూ.21,499గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్‌కు చెందిన పలు ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్స్‌పై కూడా ఆఫర్లను అందిస్తున్నారు. వన్ ప్లస్ ప్యాడ్ 3 అసలు ధర రూ.47,999 ఉండగా ఈ సేల్ లో దీన్ని రూ.42,749కి కొనవచ్చు. ఇతర వన్ ప్లస్ ట్యాబ్‌లపై కూడా డిస్కౌంట్ ధరలను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో ఐక్యూ జడ్10 లైట్ 5జి స్మార్ట్ ఫోన్‌ను రూ.10,998కి కొనవచ్చు. యాపిల్‌కు చెందిన ఐప్యాడ్ ఎయిర్ 11 ఇంచుల మోడల్ ధర రూ.51,999గా ఉంది. షియోమీకి చెందిన టీవీలపై కూడా తగ్గింపు ధరలను అందిస్తున్నారు. అసుస్ వివోబుక్ 15 ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.48,990గా ఉంది. అమెజాన్ ఎకో పాప్‌ను రూ.2,949కి కొనవచ్చు. ఫైర్ టీవీ స్టిక్ 4కె డివైస్‌ను రూ.4,499కు అందిస్తున్నారు. రియల్‌మి నార్జో 80ఎక్స్ ఫోన్ ప్రారంభ ధర రూ.11,499గా ఉంది. రియల్‌మి నార్జో 80 ప్రొ, జీటీ 7 ప్రొ, నార్జో 80 లైట్ 5జి, 80 లైట్ 4జి, నార్జో 80 ఎక్స్, నార్జో 80 ప్రొ, జీటీ 7టి, జీటీ7, జీటీ 7 ప్రొ ఫోన్లను సైతం తగ్గింపు ధరలకు అందించనున్నారు.
లావాకు చెందిన అగ్ని 3, బోల్డ్ ఎన్1 ప్రొ, బోల్డ్ ఎన్1, బోల్డ్ ఎన్1 5జి, స్టార్మ్ లైట్, స్టార్మ్ ప్లే, బ్లేజ్ డ్రాగన్, ప్లే అల్ట్రా, ఓ3 తదితర ఫోన్లను కూడా అతి తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఎంఎస్ఐ కు చెందిన పలు ల్యాప్ టాప్‌లను, పలు కంపెనీలకు చెందిన మానిటర్లను, స్పీకర్లను, సీసీ కెమెరాలను చాలా తగ్గింపు ధరలకు అందించనున్నారు. ఇక ఈ సేల్‌లో భాగంగా ఎస్బీఐ కార్డులతో ఉత్పత్తులను కొనుగోలు చేస్తే వినియోగదారులకు 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. అమెజాన్ పే ద్వారా ట్రావెల్‌పై 20 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఈ సేల్‌ను సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభించనుండగా అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇక ఈ సేల్ ఎప్పుడు ముగుస్తుంది అన్న వివరాలను వెల్లడించలేదు. కానీ దీపావళి వరకు కొనసాగనున్నట్లు సమాచారం. ఈ సేల్కు చెందిన మరిన్ని డీల్స్, ఆఫర్ల కోసం అమెజాన్ సైట్‌ను సందర్శించవచ్చు.