Amazon Black Friday Sale 2025 | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ శుక్రవారం నుంచి ప్రారంభం కాగా డిసెంబర్ 1వ తేదీ వరకు కొనసాగుతుందని తెలియజేసింది. ఇందులో భాగంగా హోమ్ డెకార్, కన్ జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, అప్పారెల్ వంటి వివిధ రకాల ప్రొడక్ట్‌లపై భారీ రాయితీలను, ఆఫర్లను అందిస్తున్నట్లు తెలియజేసింది. ఈ సేల్‌లో యాపిల్, శాంసంగ్, హెచ్‌పీ, ప్రెస్టీజ్, సెలో, టైటాన్, లోరియల్, పుమా, వన్‌ప్లస్ వంటి కంపెనీలకు చెందిన ఉత్పత్తులపై ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేల్‌లో భాగంగా ప్రతి రోజూ ఒక టాప్ డీల్‌ను ప్రకటిస్తారు. అలాగే రోజూ రాత్రి పూట 8 గంటలకు డీల్స్‌ను అందుబాటులో ఉంచుతారు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ను ఇస్తారు.
ఈ సేల్‌లో భాగంగా ఏఐని ఉపయోగించి కూడా వినియోగదారులు తమకు కావల్సిన ఉత్పత్తులను చాలా సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో వన్‌ప్లస్ 15 స్మార్ట్ ఫోన్‌ను రూ.69,499 ప్రారంభ ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే వన్‌ప్లస్ 13ఎస్ ఫోన్‌ను రూ.52,999 ప్రారంభ ధరకు అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జి ఫోన్‌ను రూ.1,18,999 ప్రారంభ ధరకు కొనవచ్చు. ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రొ 5జి ఫోన్‌ను రూ.1,09,999 ధరకు విక్రయిస్తున్నారు. రెడ్మీ ఎ4 5జి ధర రూ.7,999గా ఉంది. ఐక్యూ జడ్10ఎక్స్ 5జి ఫోన్‌ను రూ.12,999 ధరకు, రియల్‌మి నార్జో 80 లైట్ 5జి ఫోన్‌ను రూ.10,499 ధరకు, గెలాక్సీ ఎ55 5జి ఫోన్‌ను రూ.23,999కు, వన్ ప్లస్ నార్డ్ 5 ఫోన్‌ను రూ.30,249 ధరకు, లావా బోల్డ్ ఎన్1 5జి ఫోన్‌ను రూ.7,124 ధరకు కొనవచ్చు. ఈ ఫోన్లపై పలు బ్యాంకు ఆఫర్లను సైతం అందిస్తున్నారు.
ఈ సేల్‌లో భాగంగా పలు కంపెనీలకు చెందిన ల్యాప్ టాప్‌లను సైతం తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా హెచ్‌పీ కంపెనీకి చెందిన 15, 13వ జనరేషన్ ల్యాప్ టాప్‌లను రూ.52,490 ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు. అలాగే డెల్, అసుస్, లెనోవో ల్యాప్ టాప్‌లపై కూడా ఏకంగా 45 శాతం వరకు తగ్గింపు ధరలను పొందవచ్చు. ఈ సేల్‌లో శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ ట్యాబ్‌ను రూ.34,999 ప్రారంభ ధరకు కొనవచ్చు. యాపిల్, శాంసంగ్‌లకు చెందిన ట్యాబ్‌లపై 75 శాతం వరకు తగ్గింపు ధర లభిస్తుంది. అలాగే బోట్ నిర్వానా జెనిత్ ప్రొ 2025 వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌ను రూ.2,799 ధరకు కొనవచ్చు. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ కోర్ ఇయర్ బడ్స్ ధర రూ.3,499గా ఉంది. గెలాక్సీ బడ్స్ 3 ప్రొ ఇయర్ బడ్స్‌ను రూ.16,999 కు విక్రయిస్తున్నారు. ఇతర హెడ్ ఫోన్స్, మొబైల్ యాక్ససరీలు, స్పీకర్లు, సౌండ్ బార్స్ పై 80 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో సోనీ ఆల్ఫా జడ్వీ-ఈ10ఎల్ మిర్రర్‌లెస్ వ్లాగ్ కెమెరాను రూ.61,490 ధరకు కొనవచ్చు. వన్ ప్లస్ వాచ్ 2 స్మార్ట్ వాచ్‌ను రూ.13,999కు అందిస్తున్నారు. యాపిల్, శాంసంగ్, గోప్రో, సోనీ వంటి కంపెనీలకు చెందిన ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు ధరలను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా పలు కంపెనీలకు చెందిన ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, ఇతర ఉత్పత్తులపై ఏకంగా 55 శాతం వరకు తగ్గింపు ధరలను పొందవచ్చు. అలాగే ఏసీలు, చిమ్నీలు, మైక్రోవేవ్ ఓవెన్స్, కార్, టూవీలర్ ఉత్పత్తులు, హోమ్ డివైస్‌లపై కూడా ఆకట్టుకునే తగ్గింపు ధరలను అందిస్తున్నారు. అలాగే అమెజాన్ ఎకో ఉత్పత్తులు, ఫైర్ టీవీ స్టిక్‌లు, స్మార్ట్ టీవీలపై కూడా రాయితీలను పొందవచ్చు. ఇక ఈ సేల్‌లో అమెజాన్ ఫ్రెష్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తుండగా, నిత్యావసరాలపై 60 శాతం, ఔట్‌డోర్ వస్తువులపై 70 శాతం, ఫర్నిచర్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ధరలను పొందవచ్చు. ఈ సేల్ డిసెంబర్ 1వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.