WEF 2023 : కార్చిచ్చు వంటి ప్రకృతి విపత్తులను సమర్ధంగా ఎదర్కోవడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సోమవారం తెలిపింది. ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఏఐసాయంతో కర్బన ఉద్గారాలను తగ్గించ వచ్చని చెప్పింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెన్సర్లు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయడమే కాకుండా పొగను తొందరగా గుర్తించి అధికారులను అప్రమత్తం చేస్తాయి. దాంతో మంటల్ని ఎక్కువ దూరం విస్తరించకుండా అడ్డుకోవచ్చు అని వివరించింది. ప్రస్తుతం అమెరికా ఇలాంటి రెండు ప్రోగ్రామ్స్‌ను అభివృద్ధి చేస్తోందని తెలిపింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కార్చిచ్చుల కారణంగా సగటనున రూ. 50 బిలియన్ డాలర్ల (రూ.40 లక్షల కోట్ల) నష్టం వాటిల్లుతుందని వెల్లడించింది. కార్చిచ్చును అరికట్టడంతో పాటు అడవులను కాపాడడంతో కోసం ఆర్టిఫీషియల్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ (ఎమ్ఎల్) వంటి అత్యాధుని పరిజ్జానాన్ని ఉపయోగించాలని ప్రపంచ దేశాలను కోరింది.
గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2023ను విడుదల చేసింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలం కావడం, జీవవైవిధ్యం దెబ్బతినడం, విపరీతమై వాతావరణ పరిస్థితులు, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రముఖంగా ప్రస్తావించింది. కార్చిచ్చుల కారణంగా 2021లో దాదాపు 6,450 మెగా టన్నుల కార్బన్డయాక్సైడ్ (CO2) వాతావరణంలో చేరిందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 16న మొదలైన ఈ సదస్సు 20వ తేదీన ముగుస్తుంది.