సోమవారం 08 మార్చి 2021
Sangareddy - Jan 24, 2021 , 00:16:09

ప్రజల చెంతకే పోలీస్‌

ప్రజల చెంతకే పోలీస్‌

పోలీస్‌ స్టేషన్లలో దళారులకు చెక్‌

గ్రామాల్లో గ్రామ పోలీస్‌ అధికారి కార్యాలయాలు

వినూత్న ఒరవడికి ప్రభుత్వం శ్రీకారం

హర్హం వ్యక్తం చేస్తున్న ప్రజలు

మునిపల్లి, జనవరి 23: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగం గా ప్రభుత్వం పోలీస్‌ యంత్రాంగాన్ని గ్రామీణ ప్రాం తాల్లో మమేకం చేయాలనే సంకల్పంతో గ్రామ పోలీస్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు పోలీస్‌స్టేషన్లటేనే భయపడి పేరుమోసిన నాయకులనో, మధ్య దళారీలనో ఆశ్రయించి స్టేషన్‌కు వెళ్లే బాధితులకు ఇక నుంచి ఆ బాధలు తొలిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ చిన్న గొడవ జరిగి నా ఆ గ్రామానికి నియమించబడ్డ పోలీసు అధికారి గ్రామంలో నిజానిజాలు పరిశీలించి గ్రామ పెద్దలతో మాట్లాడి సమస్యలను అక్కడే పరిష్కరించేలా కృషిచేస్తా రు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన గ్రామ పోలీస్‌వ్యవస్థపై గ్రామాల్లో మంచి స్పందన కన్పిస్తోంది. గ్రామాల్లో చిన్నపాటి భూ తగాదాలు, పంచాయతీలు, పరస్పర దూషణలు వంటి చిన్న చిన్న తగాదాలకు సైతం ప్రజలు తమ సొంత పనులు వదులుకొని పోలీస్‌స్టేషన్లను ఆశ్రయించేవారు. అక్కడ అందుబాటులో ఎస్‌ఐ, ఆపై స్థాయి అధికారి లేకపోవడంతో బాధితులు పోలీస్‌స్టేషన్ల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. వీటన్నింటిని గమనిం చిన ప్రభుత్వం గ్రామ పోలీస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చినప్పటినుంచి ప్రజలు పోలీస్‌ స్టేషన్లకు వచ్చే శాతం తగ్గింది. మండలంలో 100శాతం గ్రామాల్లో గ్రామ పోలీస్‌ అధికారిని నియమించి గ్రామంలో పోలీస్‌ అధికారి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మండలంలో కానిస్టేబుళ్ల సంఖ్యను బట్టి పెద్ద గ్రామానికి ఒకరు, చిన్న గ్రామ పంచాయతీల్లో రెండు గ్రామాలకు ఒక కానిస్టేబుల్‌ను నియమించారు. పోలీస్‌ అధికారి వారానికి 2, 3సార్లు గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులతో మాట్లాడి గ్రామ పరిస్థితులను అధ్యయనం చేస్తారు. తద్వారా గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం కలిగించేందుకు చర్యలు తీసుకుంటారు. గ్రామ పోలీస్‌ నియామకం పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. 

ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే ...

ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే ప్రభుత్వం గ్రామ పోలీస్‌వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో చాలావరకు గ్రామా ల్లో కేసులు తగ్గుతాయి.  ఫిర్యాదు ల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది. 

- శివలింగం, కొండాపూర్‌ సీఐ 

గ్రామాల్లో గొడవలు తగ్గుతాయి...

గ్రామ పోలీస్‌వ్యవస్థ వల్ల గ్రామాల్లో గొడవలు తగ్గిపోతా యి. గ్రామ పోలీస్‌ అధికారి గ్రా మంలో ఎప్పటికప్పుడు పర్యటి స్తూ ప్రజల మధ్య ప్రశాంతమైన వాతావరణం తెచ్చేలా కృషి చేస్తారు. అందుకు గ్రామస్తులు అధికారికి సహకరించాలి.

- మహేశ్వర్‌రెడ్డి, మునిపల్లి ఎస్‌ఐ 

పోలీస్‌ వ్యవస్థపై నమ్మకం...

గ్రామానికో పోలీస్‌ అధికారిని నియమించడంతో పోలీస్‌వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ప్రజలకు కూడా పోలీస్‌లతో మంచి స్నేహం ఏర్పడుతుంది. వ్యయప్రయాసలు కూడా తగ్గుతాయి. గ్రామ పోలీస్‌వ్యవస్థతో గ్రామాల్లో గొడవలు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది.

- ఖధీర్‌,  కంకోల్‌ గ్రామస్తుడు

VIDEOS

logo