తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విజయ్. ఆయన నటించిన సినిమాలు ఏకకాలంలో తమిళం, తెలుగులో విడుదలవుతున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని అంచనాలు ‘లియో’పై నెలకొన్నాయి. దీనికి కారణం దర్శకుడు లోకేశ్ కనకరాజ్. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి లోకేష్ .. విజయ్ తో మరోసారి జట్టుకట్టి చేసిన ‘లియో’పై ఎన్నడూలేనంత అంచనాలు పెరిగాయి. మరా అంచనాలని లియో అందుకున్నాడా? లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ మరోసారి ప్రేక్షకులని అలరించిందా? తెలుసుకోవాల్సిందంటే కథలోకి వెళ్ళాల్సిందే
పార్తిబన్ (విజయ్) ఫ్యామిలీ మ్యాన్. అతని భార్య (త్రిష). వీరికి ఇద్దరు స్కూల్ చదువుకునే పిల్లలు. అనాథ అయిన పార్తివన్ సత్యని వివాహం చేసుకున్న తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఓ కాఫీ షాప్ నడుపుతూ అక్కడే సెటిల్ అవుతాడు. తనకి కుటుంబమే ప్రపంచం. ఒకరోజు ఒక దొంగల ముఠా అతని కాఫీ షాప్ లో చొరబడి డబ్బు దోచుకోవడంతో పాటు తన కూతురి చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆత్మ రక్షణలో భాగంగా ఆ ముఠాని కాల్చి చంపేస్తాడు పార్తిబన్. ఆత్మ రక్షణ కోసం చేశాడు కాబట్టి కోర్టు కూడా పార్తిబన్ కు ఎలాంటి శిక్ష లేకుండా వదిలేస్తుంది. ఈ సంఘటన తర్వాత పార్తిబన్ ఫోటో పత్రికల్లో ప్రచారం అవుతుంది. పార్తివన్ ఫోటో చూసి.. అతడే లియో దాస్ అని అంటోనీ దాస్ (సంజయ్ దత్) హెరాల్డ్ దాస్ (అర్జున్ సర్జా) పార్తిబన్ వెంటపడతారు. అతడిని వెంట తీసుకెళ్ళాలని ప్రయత్నస్తారు. తను లియో కాదని ఎంత చెప్పినా వినరు. అసలు ఈ లియో ఎవరు? అంటోనీ దాస్ కి లియోతో వున్న అనుబంధం ఏమిటి ? అంటోనీ దాస్ వెదుకుతున్న లియో దాస్.. పార్తిబన్ యేనా ? కాదా ? అంటోనీ వలన పార్తిబన్ కుటుంబం ఎలాంటి కష్టాలు ఎదురుకుంది ? అనేది తక్కిన కథ.
కథ పరంగా చూసుకుంటే లియోలో కొత్త పాయింట్ లేదు. ఇది రజనీకాంత్ బాషా తరహా కథ. ఇలాంటి కథనంతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. గతంలో ఎంతో విద్వంసంగా శక్తివతంగా బతికిన హీరో.. ఏవో కారణాల వలన తన జీవనశైలిని మార్చుకొని వేరే చోట చాలా సామాన్యుడిగా ఉంటాడు. ఎదో సంఘటన అతడ్ని మళ్ళీ గతంలో తీసుకెళ్ళి మిగిలన పగ ప్రతీకారం లాంటిది ఏదైనా వుంటే దాన్ని పూర్తి చేస్తుంది. లియో కూడా ఆ టెంప్లెట్ కనిపిస్తుంది కానీ.. ఒక చిన్న తేడా ఏమిటంటే.. కథానాయకుడు మళ్ళీ గతంలో వెళ్లాలని అనుకోడు. ఎందుకనేది తెరపై చూడాలి.
పైగా ఇలాంటి రొటీన్ కథకు కూడా ఒక హాలీవుడ్ సినిమా స్ఫూర్తి తీసుకున్నాడు దర్శకుడు. హిస్టరీ అఫ్ వైలెన్స్ అనే స్ఫూర్తితో ఇందులో కొన్ని సన్నివేశాలని నడిపాడు. ఓ ముఠా క్రూరమైన దొంగతనాలతో కథ మొదలౌతుంది. ఆ ముఠా పార్తివన్ జీవితంలోకి వచ్చిన తర్వాత సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయి. కాపీ షాఫ్ లో చేసిన ఫైట్ బావుటుంది. తర్వాత కోర్టు సన్నివేశాలు, తన కుటుంబాన్ని కాపాడటానికి పార్తిబన్ చేసే ప్రయత్నాలు ఓకే అనిపిస్తాయి. సంజయ్ దత్ పాత్ర ఎంట్రీతో ఆసక్తికరమైన ఇంటర్వెల్ పడుతుంది.
అయితే లియో సెకండ్ హాఫ్ లో ట్రాక్ తప్పుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తేలిపోతుంది. పైగా ఇందులో బలమైన విలన్ అంటూ ఎవరూ వుండరు. సంజయ్ దత్ పాత్రకు పెట్టిన మూఢనమ్మకాలు సెంటిమెంట్ వర్క్ పుట్ కాలేదు. ప్రీక్లైమాక్స్ నుంచి సినిమాని ఇంకా డ్రాగ్ చేసేశారు. బేసిగ్గా లోకేష్ కనకరాజ్ కథలు డిఫరెంట్ లేయర్స్ లో వుంటాయి. లియోలో కేవలం ఒకటే లేయర్. దీంతో చాలా చోట్ల సహనానికి పరీక్షలా వుంటుంది. అయితే క్లైమాక్స్ ఫైట్ తో పాటు తన ఇంటి చుట్టూ రక్షణ కవచంలా పెట్టిన యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునేలా వుంటాయి.
విజయ్ వన్ మ్యాన్ షో ఇది. దాదాపు సన్నివేశాలు ఆయన చుట్టూనే వుంటాయి. విజయ్ అంటే మాస్ యాక్షన్. ఇందులో మాత్రం కాస్త స్టయిలీష్ గా యాక్షన్ డిజైన్ చేశారు. తన పాత్రకు రెండు కోణాలు వున్నాయి. మొత్తం కథని తన భుజాలుమీదే మోశాడు. సంజయ్ దత్, అర్జున్ పాత్రలని సరిగ్గా వాడుకోలేదనిపించింది. త్రిష డీసెంట్ గా చేసింది. మిగతా నటీనటులు పరిధిమేర చేశారు.
టెక్నికల్: అనిరుధ్ రవిచందర్ అందించిన నేపధ్య సంగీతంతో యాక్షన్, ఎలివేషన్ సన్నివేశాలకు మంచి బలాన్ని ఇచ్చింది. మనోజ్ పరమహంస కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. ఎడిటింగ్ ఇంకాషార్ఫ్ గా వుండాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి, ప్రతి క్రాఫ్ట్ లో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి చెప్పుకుంటే.. ఖైదీలో నెపోలియన్ పాత్ర ఇందులో కనిపిస్తుంది. అలాగే చివర్లో విక్రమ్ పాత్ర వాయిస్ కూడా వినిపిస్తుంది. అయితే విక్రమ్ లో రోలెక్స్ లాంటి పవర్ ఫుల్ లింక్ ఏదైనా ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. లియో చుట్టూ చాలా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలని అందుకునే సినిమాటిక్ యూనివర్స్ ఇందులో కుదరలేదు.
విజయ్,
యాక్షన్ సీక్వెన్స్ లు
అనిరుధ్ నేపధ్య సంగీతం
కథలో కొత్తదనం లేకపోవడం
సెకండ్ హాఫ్ సాగదీత
బలమైన విలన్ లేకపోవడం