వీవోఏల సంబురం..
సబ్బండ వర్ణాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు తదితరుల వేతనాలను పెంచి అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రభుత్వం తాజాగా వీవోఏల గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రక్షాబంధన్ కానుకగా వీవోఏ(గ్రామీణ స్వయం సహాయక సంఘాల సహాయకులు)ల గౌరవ వేతనాలను పెంచుతూ ఆదేశాలిచ్చింది.
- జిల్లావ్యాప్తంగా వీవోఏల హర్షాతిరేకాలు
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
- వికారాబాద్ జిల్లాలో 657 మంది గ్రామీణ స్వయం సహాయక సంఘాల సహాయకులకు లబ్ధి
వికారాబాద్, సెప్టెంబర్ 1, (నమస్తే తెలంగాణ) : సబ్బండ వర్ణాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు తదితరుల వేతనాలను పెంచి అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రభుత్వం తాజాగా వీవోఏల గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రక్షాబంధన్ కానుకగా వీవోఏ(గ్రామీణ స్వయం సహాయక సంఘాల సహాయకులు)ల గౌరవ వేతనాలను పెంచుతూ ఆదేశాలిచ్చింది. అయితే ఇప్పటివరకు రూ.3900లుగా ఉన్న గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేలకు పెంచింది. అయితే వీవోఏలకు పెంచిన గౌరవ వేతనం ఈనెల నుండే ప్రభుత్వం అమలు చేయనుంది. మరోవైపు రెండేళ్లలో వీవోఏల గౌరవ వేతనం రెండు సార్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. అయితే 2017లో వీవోఏల గౌరవ వేతనాన్ని రూ.3 వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం, గతేడాది వీవోఏల గౌరవ వేతనం రూ.3లుగా ఉండగా 30 శాతం పెంచి రూ.3900లకు పెంచారు. వీవోఏల గౌరవ వేతనం పెంపుతో జిల్లావ్యాప్తంగా వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జిల్లా అంతటా పాలాభిషేకం నిర్వహించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని 657 మంది గ్రామీణ స్వయం సహాయక సంఘాల సహాయకులకు లబ్ధి చేకూరనుంది.
మీమంతా.. సీఎం వెంటే..
మా కోరిక మేరకు సీఎం కేసీఆర్ జీతాలు పెంచారు. వీవోఏలమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. జీతాలను నేరుగా అకౌంటులో జమ అయ్యేలా చొరవ తీసుకోవాలని ఆశిస్తున్నా.
– వీరేశం, వీవోఏమాలసోమారం గ్రామం, (బంట్వారం)
సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు..
వేతనాలను పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలోనే మాకు న్యాయం జరుగుతున్నది. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.
– లక్ష్మి, శంకర్పల్లి
జీతాలు పెంపు సంతోషంగా ఉన్నది..
వీవోఏల జీతాలను పెంచడం సంతోషంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– చొప్పరి శిరీష, రుద్రారం గ్రామం, (ధారూరు)
వీవోఏల కుటుంబాలు రుణపడి ఉంటాయి..
వీవోఏల వేతనాలు పెంచినందుకు మా కుటుంబాలన్నీ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో సేవలు చేయించుకున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకోలేదు. వీవోల వేతనాలు పెంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– భాగ్యలక్ష్మి అల్లీపూర్, (ధారూరు)
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
గత ప్రభుత్వాలు మా వీవోఏలను పట్టించుకున్న పాపాన పోలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మా కష్టాలు అర్థం చేసుకుని జీతాలను పెంచారు. మాపై ఇంతటి ప్రేమ చూపిస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– బోడిగెల సైదుల్ కుమార్, వీవోఏ, సింగంపల్లి (ఆమనగల్లు)
సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు..
ఎన్నో ఏండ్లుగా తక్కువ వేతనానికి కష్టపడుతున్న వీవోఏల కష్టాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు. వేతనాలను పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు వీవోఏల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వానికి వీవోఏల మద్దతు ఎప్పటికీ ఉంటుంది.
– రమేశ్, వీవోఏ, వీర్లపల్లి, (నందిగామ)
సంతోషంగా ఉన్నది..
వీవోఏల వేతనాలు పెంచినందుకు చాలా సంతోషంగా ఉన్నది. సేవలను గుర్తించినందుకు సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం. వీవోఏల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఏర్పడింది. మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే వీవోఏల బతుకులు మారుతాయి.
– నర్సింహ వీవోఏ కోటమర్పల్లి(మర్పల్లి )
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

