పచ్చదనా విఠ్యాల
నాటి ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన ఫరూఖ్‌నగర్ మండలంలోని పలు గ్రామాలు.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటూ అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చుకుంటున్నా యి
- పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
- నాడు అభివృద్ధిలో వెనుకబాటు..నేడు ఆదర్శ గ్రామం వైపు పరుగులు
- ఇప్పటివరకు రూ.82 లక్షలతో అభివృద్ధి పనులు
- గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులు
- స్థానికుల హర్షం
షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 6: నాటి ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన ఫరూఖ్‌నగర్ మండలంలోని పలు గ్రామాలు.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటూ అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చుకుంటున్నా యి. దీంతో పలు గ్రామాల ప్రజల ప్రభుత్వ తీరును హ ర్షిస్తూ .. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.

విఠ్యాల గ్రామం..
మండలంలోని విఠ్యాల గ్రామంలో 10 వార్డులు 460 ఇం డ్లు ఉండగా 1,727 జనాభా ఉంది. అందులో 852 పురుషులు, 847 స్త్రీలు ఉండగా వారిలో 1,237 మంది ఓటర్లున్నారు. గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, మూడు అంగన్వాడీ కేంద్రాలు, పల్లెప్రకృతివనం, తెలంగాణ క్రీడాప్రాంగణం, వైకుంఠధామం, హరితహారం నర్సరీ, ఇంటింటికీ భగీరథ నీటి సరఫరా, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, కంపోస్టు షెడ్డు, డంపింగ్‌యార్డు, రైతు వేదిక భవనం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పల్లెప్రగతి కార్యక్రమం కింద ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుండటంతో గ్రామం రూపురేఖలు పూర్తిగా మారి.. ఆదర్శ గ్రామం వైపు పరుగులు పెడుతున్నది.
విఠ్యాల గ్రామంలో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. రోడ్లు, ఇండ్ల ఎదుట హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలను నాటారు. దీంతో ఆ మొక్కలు ఏపుగా పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామంలో ఇప్పటికే 4,500 మొక్కలను నాటారు. అదేవిధంగా నర్సరీలో మూడు వేలు, పల్లెప్రకృతివనంలో 300 మొక్కలు ప్రస్తుతం నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. గ్రామంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించడంతో గ్రా మం మొత్తం మరింత శోభను సంతరించుకున్నది. అంతేకాకుండా గ్రామాన్ని పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుతున్నారు. ఇంటింటికీ పంపిణీ చేసిన తడి, పొడి బుట్టల్లోనే చెత్తను వేసి ఇండ్ల ముందుకు వచ్చిన ట్రాక్టర్లో చెత్తాచెదారాన్ని వేస్తున్నారు. ఆ చెత్తను పారిశుధ్య సిబ్బంది డం పింగ్ యార్డుకు తీసుకెళ్లి అక్కడ సేంద్రియ ఎరువును తయా రు చేస్తున్నారు. ఆ ఎరువును హరితహారం, పల్లెప్రకృతివనంలోని మొక్కలకు వినియోగిస్తున్నారు.
రూ.82 లక్షలతో అభివృద్ధి పనులు
విఠ్యాల గ్రామంలో ఇప్పటివరకు రూ. 82లక్షలతో పలు అభివృద్ధి పనులు పూర్తైయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతోపాటు గ్రామ పంచాయతీ నిధులతో గ్రామాన్ని సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. గ్రామపంచాయతీ నిధుల నుంచి రూ. 28 లక్షలు,14వ ఆర్థిక సంఘం నుంచి రూ.31 లక్షలు, ఎస్ జీఎఫ్ నిధులు 28లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి దీపాలు, క్రీడాప్రాంగణం తదితర అభివృద్ధి పనులను పూర్తి చేశారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హరితహారంతో సరికొత్త శోభ
హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్లకు ఇరువైపులా, ఇండ్ల ఎదుట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పెంచాయి. దీంతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. గ్రామాభివృద్ధికి సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు కృషి చేస్తున్నారు.
– చంద్రశేఖర్, గ్రామభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, విఠ్యాల గ్రామం
గ్రామ రూపురేఖలు మారాయి
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో మా గ్రామం అభివృద్ధిలో వెనుకబడి అస్తవ్యస్తంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గ్రామ రూపురేఖలు మారాయి. అన్ని వార్డు ల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలను నిర్మించారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యమిచ్చి అభివృద్ధి పనులను సర్పంచ్, వార్డు సభ్యులు చేపడుతున్నారు. అభివృద్ధిలో గ్రామం ముందుండటం చాలా సంతోషంగా ఉంది. – పాల జంగయ్య,గ్రామస్తుడు ,విఠ్యాల గ్రామం
గ్రామస్తుల సహకారంతోనే..
ప్రభుత్వ, గ్రామ పంచాయ తీ నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నా. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తున్నా. ఇప్పటికే లక్షలాది రూపాయలతో సీసీ రోడ్లు, అం డర్ గ్రౌండ్ డ్రైనేజీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డు లాం టి పలు ప్రగతి పనులను పూర్తి చేశా. గ్రామాభివృద్ధికి గ్రామస్తులు, అధికారులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు.
– జయశ్రీ, గ్రామసర్పంచ్,విఠ్యాల గ్రామం
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

