పెద్దేముల్ మీ-సేవా కేంద్రంలో బారులు తీరిన జనం

పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వం 57 ఏండ్ల లోపు వయస్సున్న ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లను అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు మీ-సేవా కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకోవడానికి బారులు తీరారు. ముఖ్యంగా పెద్దేముల్ మండల కేంద్రంలో బుధవారం స్థానిక మీ-సేవా కేంద్రాలకు జనాలు భారీగా తరలివచ్చారు. దీంతో మీ-సేవా కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి.
తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 19, 2018 సంవత్సరంలోపు ఎవరైతే 57 సంవత్సరాల నుంచి 64 ఏండ్ల వయస్సు నిండి ఉంటారో అలాంటి వారు ఆసరా పింఛన్ల కోసం మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల చివరి వరకు దరఖాస్తు గడువు ఉందని తెలిపారు. అందరూ ఒకే రోజు పెద్ద మొత్తంలో మీ-సేవా కేంద్రం వద్ద గుమిగూడడంతో మీ-సేవా ప్రాంగణం కిక్కిరిపోయింది. మరోవైపు ప్రభుత్వం ఆసరా పింఛన్ల దరఖాస్తులకు మీ-సేవా కేంద్రాల్లో సైతం ఎలాంటి రుసుము పెట్టకపోవడంతో ఆయా గ్రామాల జనాలు మీ-సేవా కేంద్రం వద్ద దరఖాస్తు చేసుకోవడానికి బారులు తీరారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

