బొంరాస్పేట : మండలంలోని తుంకిమెట్ల, మండల కేంద్రంలోని పీహెచ్సీలో బుధవారం సద్దుల బతుకమ్మ సంబురాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి దుర్గామాత మండపం ఎదుట బతుకమ్మలను ఉంచి చుట్టూ మహిళలు పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు.