శంకర్పల్లి : టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటుడు బాలాజీ సోమవారం శంకర్పల్లి మండలంలోని మరకత శివలింగాన్ని దర్శించుకున్నారు. శివలింగాన్ని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలోని శివలింగాన్ని సోమవారం నటుడు, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి బాలాజీ దర్శించుకున్నారు.
స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బాలాజీకి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు బాలాజీని స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర రాజు, గౌరవ అధ్యక్షుడు సదానందం గౌడ్, చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, మాజీ సర్పంచ్ స్వప్నమోహన్ తదితరులు పాల్గొన్నారు.