షాద్‌నగర్, జనవరి 9 : బీమా డబ్బులను కాజేయాలనే కుట్రతో ఓ వ్యక్తిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుల్లోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెం దాడని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. మృతుడు రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, హత్యకు గురయ్యాడని తేల్చారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో వారిని అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి హత్యకేసు వివరాలను వెల్లడించారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామం బోడతండాకు చెందిన బోడ శ్రీకాంత్ రియ ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హైదరాబాద్‌లోని బాచుపల్లి, మల్లంపేటలో స్థిరపడ్డాడు. అతడి వద్ద పరిచ యం ఉన్న భిక్షపతి(32)తోపాటు మహబూబాబా ద్ జిల్లా గూడూరు మండలంలోని రాముతండాకు చెందిన బానోతు సమ్మన్న, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామానికి చెందిన సతీశ్ పని చేస్తున్నారు. అయితే శ్రీకాంత్‌పై ఫేక్ సర్టిఫికెట్లతో పలు బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులను పొంది.. బ్యాంకులను మోసం చేసిన ఘటనలపై కేసులు నమోదయ్యాయి.
కాగా భిక్షపతికి తల్లిదండ్రులు, సోదరులు లేకపోవడంతో అతడి పేరున ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్ ద్వారా రూ.50 లక్షల జీవి త బీమాను.. అదేవిధంగా హైదరాబాద్‌లోని మేడిపల్లిలో రూ.52 లక్షలతో నూతన గృహాన్ని కొని అతడి పేరున శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించాడు. శ్రీకాంత్‌కు డబ్బులు అవసరం ఉండడంతో భిక్షపతి పేరున ఉన్న ఇంటిని అమ్ముదామని చెప్పగా అతడు నిరాకరించాడు. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న శ్రీకాంత్ తనకు పరిచయం ఉన్న వికారాబాద్ జిల్లాలోని దాశ్యానాయక్తండాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ మోతీలాల్‌కు తన సమస్యను వివరించాడు.
భిక్షపతి పేరున ఉన్న బీమా డబ్బులతోపాటు ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చెప్పితే రూ.పది లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇందుకు భిక్షపతిని చంపాలని వారు నిర్ణయించుకున్నారు. ఇందు కు సతీశ్, సమ్మన్నల సహకారం తీసుకున్నారు. నలుగురు కలిసి 2021 డిసెంబర్ 22న రాత్రి భిక్షపతికి అతిగా మద్యం తాగించి కారులో ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ కారు నుంచి కిందికి దిగిన భిక్షపతిపై హాకి స్టిక్‌తో దాడి చేశారు .మృతి చెందినట్లు ధ్రువీకరించుకున్న అనంతరం అతడి మృతదేహాన్ని రోడ్డు పై పడేసి ఆ నలుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అప్పట్లో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు షాద్‌నగర్ పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి పాన్ కార్డు ఆధారంగా పలు విషయాలు రాబట్టడంతోపాటు బీమా చేసిన బ్యాంకు సిబ్బందిపై పలు అనుమాను లు రావడంతో ఆ దిశగా కేసును దర్యాప్తు చేయగా.. బీమా డబ్బులకోసమే భిక్షపతిని బోడ శ్రీకాంత్, మోతీలాల్, సమ్మన్న, సతీశ్ హత్య చేసినట్లు గుర్తిం చి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, రాంబాబులను షాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు.