జాబితాలో పేరున్నా.. డబ్బులు జమకాలె..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష లోపు రుణమాఫీపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రాని వారు కొందరైతే.. రుణమాఫీ జాబితాలో పేర్లుండి కూడా.. మాఫీ సొమ్ము ఖాతాల్లో పడని వారు చాలామంది ఉన్నారు.
- రూ.లక్షలోపు రుణమాఫీపై గందరగోళం
- 1,502 మంది రైతు ఖాతాల్లో క్రెడిట్ కాని రుణమాఫీ డబ్బులు
- ఖాతాల్లోని పేర్లు, ఆధార్‌కు మధ్య తేడా
- కారణంగా అందని మాఫీ కుటుంబం యూనిట్‌గా ప్రక్రియ
- మాఫీకి దూరంగా వేలాది మంది రైతులు
- గ్రీవెన్స్‌కు భారీగా ఫిర్యాదులు
- రుణమాఫీ తిరస్కరణకు యాప్‌లో చూపుతున్న కారణాలెన్నో!
రంగారెడ్డి, జూలై 21 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష లోపు రుణమాఫీపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రాని వారు కొందరైతే.. రుణమాఫీ జాబితాలో పేర్లుండి కూడా.. మాఫీ సొమ్ము ఖాతాల్లో పడని వారు చాలామంది ఉన్నారు. జిల్లాలో 49,741 మంది రైతులకు రూ.278.06 కోట్ల రుణమాఫీని చేసినట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ఈ నెల 21వ తేదీ వరకు ఇంకా 1,502 మంది ఖాతాల్లో మాఫీ సొమ్మే జమ కా లేదు. మాఫీ కాకపోవడానికి గల కారణాలను ఏవో, ఏఈవోలు తమ వద్ద ఉన్న యాప్‌లో చూసి చెబుతుండగా..వారు వెల్లడిస్తున్న వివరాలను విని రైతులు అవాక్కవుతున్నారు.
అంతా అయోమయం..
రుణమాఫీకి సంబంధించి సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటికి స్పష్టమైన సమాధానం చెప్పే వారే కరువయ్యారు. ప్రభుత్వం రూపొందించిన ఉత్తర్వుల మేరకు పట్టా పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ తొలి విడతలో రూ.లక్ష వరకు మాఫీ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాలి. కానీ..బ్యాంకులు పంపిన జాబి తాలో ఉన్న రైతుల్లో చాలామందికి మాఫీ జమకాకపోవడంపై గందరగోళం నెలకొన్నది.
ఇందుకు అధికారులు అనేక కారణాలు చెబుతున్నారు. ఖాతాల్లో పేర్లకు, ఆధార్‌కు మధ్య తేడా కారణంగానే మాఫీ డబ్బులు జమకాలేదని వారు పేర్కొంటున్నారు. రేషన్‌కార్డులో పేరు లేకున్నా రుణమాఫీ డబ్బులు పడడంలేదు. మరోపక్క కొం తమంది రైతుల ఖాతాలకు సంబంధించి ఫ్రీ ఆడిట్ నిర్వహణకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతున్నది. ఆయా ఖాతాలకు సంబంధించిన రైతులు ఎంత మేరకు రుణాలు తీసుకున్నారు?. వడ్డీ ఎంత..? ఎంత చెల్లించారు!.
రెన్యువల్ ఖాతాలెన్నీ? రెన్యువల్ తర్వాత బ్యాంకులేమైనా రుణాలిచ్చాయా? తదితర అంశాల వారీగా ఫ్రీ ఆడిట్‌ను నిర్వహించనున్నారు. ఇలా..పరిశీలించే ఖాతాలకు ఆడిట్ పూర్తయ్యే వరకు నిధులను జమచేయడం లేదు. ఈ కారణంగానూ జాబితాలో పేరున్న రైతుల ఖాతాల్లో మాఫీ డబ్బులు జమకానట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 48,239 మంది రైతులకు సంబంధించి రూ.250 కోట్ల మేర రుణమాఫీ డబ్బులు మాత్రమే రైతుల ఖాతాల్లో చేరాయి. ఇంకా 1,502 మంది రైతులకు సంబంధించి రూ.28 కోట్లకు పైగా మాఫీ డబ్బులు ఖాతాల్లో జమకావాల్సి ఉన్నది.
యాప్‌లో చూపుతున్న కారణాలెన్నో..
కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది పేరిట భూమి ఉన్నా..ఒకే బ్యాంకు ఖాతా ఉండి, రూ.లక్ష లోపే రుణం ఉన్నప్పటికీ రుణమాఫీ జాబితాలో ఆయా రైతుల పేర్లు రాలేదు. ఇంకొన్ని చోట్ల కుటుంబంలో ఒకరి కన్నా.. ఎక్కువ మంది పేరిట రుణం ఉండి, అంతా కలిపి రూ.లక్ష లోపు ఉండగా.. ఒక్కరి పేరుమీద ఉన్న మొత్తం మాత్రమే మాఫీ అయినట్లు తెలుస్తున్నది. ఒకే రైతు వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే..ఆ రెండు ఖాతాలను మెర్జ్ చేసి చూస్తున్నారు. రెండింటిలో ఎంత మొ త్తం ఉందో ఆ ప్రకారమే రుణమాఫీ చేస్తున్నారు. రూ.లక్షకు మించి ఉంటే మాఫీ కావడం లేదు. ఇటువంటి విషయాలకు సంబంధించి రైతులకు సమాచారం ఇచ్చే వారు లేకపోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్, వాణిజ్య, గ్రామీణ బ్యాంకుల్లో రుణాలు పొంది జాబితాలో పేర్లు రాని రైతులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఈ క్రమంలో గ్రీవెన్స్‌కు భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో.. రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరికైనా మాఫీ కాకుంటే.. ఏవోలు, ఏఈవోల వద్దకు వెళ్లి ఆధార్‌కార్డు సంఖ్య చెబితే వెంటనే దాన్ని యాప్‌లో అప్లోడ్ చేసి రైతులకు కారణాలను చెబుతున్నారు. రైతు పేరిట తెల్ల రేషన్ కార్డు లేదని, ఆధార్‌లోని పేరుతో బ్యాంకు ఖాతాలోని పేరు సరిపోవడం లేదని, 2023 డిసెంబర్ 9 నాటికి అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉందన్న కారణాలను పోర్టల్‌లో చూపుతున్నది. కొంతమంది రుణ ఖాతాల సమాచారం పోర్టల్‌లో అందుబాటులో లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లిస్తుండడం వంటి కారణాల వల్ల రుణమాఫీ జాబితాలో పేర్లు రాలేదని యాప్ వెల్లడిస్తుండడంతో రైతులు అవాక్కవుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

