సులభతరం.. వేగవంతం
తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) అమలు చేస్తున్నది. దీంతో భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకోవడం చాలా సులభతరమైంది. కార్యాలయం చుట్టూ తిరగడం, నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది.
- టీఎస్ బీపాస్ అమలుతో భవన నిర్మాణానికి ఈజీగా లభించనున్న అనుమతులు
- దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే పర్మిషన్
- ఆదిబట్ల మున్సిపాలిటీలో 662 దరఖాస్తులు
- అనుమతి ఇచ్చినవి 471.. తిరస్కరించినవి 140
- అండర్ ప్రాసెస్‌లో 27.. సింగిల్ విండో విధానంలో 24
- ఈ విధానంతో మూడు నెలల్లో వచ్చిన రూ.4కోట్ల ఆదాయం
ఆదిబట్ల, ఆగస్టు 27 : తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) అమలు చేస్తున్నది. దీంతో భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకోవడం చాలా సులభతరమైంది. కార్యాలయం చుట్టూ తిరగడం, నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అనుమతి లభిస్తున్న ది. ఆదిబట్ల మున్సిపాలిటీలో మూడు నెలల నుంచి ఇప్పటివరకు 662 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 471 మందికి అనుమతి లభించగా.. 140 దరఖాస్తులను తిరస్కరించారు. 27 అండర్ ప్రాసెస్‌లో ఉండగా మరో 24 సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటివరకు రూ.4కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం..
మున్సిపాలిటీల్లో భవన నిర్మాణానికి అనుమతులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీపాస్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో భవన నిర్మాణ అ నుమతుల కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగ డం, అధికారులను ప్రసన్నం చేసుకోవడం, నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు లభిస్తున్నాయి. నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం యజమాని ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా 21 రోజుల్లోనే భవన నిర్మాణం అనుమతులు వచ్చేలా రూపొందించిన ఈ టీఎస్ బీపాస్ సిస్టంపై సర్వ త్రా హర్షం వ్యక్తమవుతున్నది. స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్లైన్లోనే సంబంధిత పత్రాలను పొందుపర్చాల్సి ఉం టుంది. (tsbpass.telangana.govt.in) వెబ్ సైట్లో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకుంటే స్థల విస్తీర్ణం మేరకు అందులోనే ఫీజులు నిర్ధారించి, అన్నీ సక్రమంగా ఉంటే 21 రోజుల్లోనే అనుమతులు లబిస్తున్నాయి.
నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా
టీఎస్‌బీపాస్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు పొందుపరిచారు. స్వీయ ధ్రువీకరణలో ఇచ్చిన వివరాల ప్రకారం భవనాన్ని నిర్మించకుంటే నిర్మాణదారులు ఇబ్బందులు పడుతారు. అనుమతులు పొందిన భవనాల వివరాలు బీపాస్‌లో నమోదు చేస్తారు. వీటిని ఎప్పటికప్పుడు కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ అనుమతులు తీసుకున్న ప్రకారం భవన నిర్మాణం జరిగిందా లేదా ఏమై నా తేడాలు ఉన్నాయా ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఏమైనా జరిగాయా అని పరిశీలిస్తారు. ఒకవేళ తేడాలు ఏమైనా ఉంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వాటిని కూల్చేస్తారు. వారికి జరిమానా విధిస్తారు.
లేఅవుట్లకు అనుమతులు
స్వీయ ధ్రువీకరణ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న డెవలపర్లకు తాత్కాలిక లేఅవుట్ ప్లాన్ అనుమతిని ఆన్లైన్లో 21 రోజుల్లో ఇస్తారు. లే అవుట్ పూర్తి చేసుకున్న తర్వాత లైసెన్స్ కలిగిన సాంకేతిక సిబ్బందితో అటెస్ట్ చేయించి జిల్లా కమిటీలు పరిశీలించాకే తుది అనుమతులు జారీ చేస్తారు. మున్సిపాలిటీకీ తనఖాగా పెట్టిన ప్లాట్లను తుది అనుమతులు తీసుకోకుండా భూమిని అభివృద్ధి చేసిన డెవలపర్‌కు ఆ భూమి విలువలో 25 శాతం జరిమానా విధిస్తారు. అక్రమ లేఅవుట్ వివరాలను సబ్‌రిజిస్ట్రార్‌కు సర్వే నంబర్ సహ నివేదికలను అందజేస్తారు. దీంతో లేఅవుట్ లేని స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నిక్షిప్తం కావడంతో నిర్మాణాలకు అనుమతులు లభించవు.

టీఎస్‌బీపాస్ ప్రత్యేకతలు
టీఎస్‌బీపాస్‌తో మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు అనుమతులు సులభంగా లభిస్తాయి. స్వీయ ధ్రువీకరణతో తక్షణ అనుమతులు రానున్నాయి. 75 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో నిర్మించే భవనాలు పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్ట్టిఫికెట్ తీసుకోవాలి. సదరు యజమాని ఇచ్చే స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఈ సర్టిఫికెట్‌ను 15 రోజుల్లో జారీ చేస్తారు. నివాసేతర భూములకు కూడా ఆర్కిటెక్‌తో అటెస్ట్ చేయించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా 15 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు.
- 75 చదరపు గజాల లోపు స్థలంలో ఏడు మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు అనుమతులు అవసరం లేదు. నామమాత్రంగా రూపాయి చెల్లించి భవన నిర్మాణ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు.
- 75 నుంచి 239 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో ఏడు మీటర్ల ఎత్తు (జీప్లస్ వన్)వరకు నిర్మించే నివాస భవనాలకు తక్షణ అనుమతి పొందే వీలుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగానే పర్మిషన్ వస్తున్నది.
- 239 చదరపు గజాల నుంచి 598 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో పది మీటర్ల ఎత్తు (జీప్లస్ టూ)వరకు నివాస భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అనుమతులు ఇస్తారు.
- 598 గజాలకన్నా ఎక్కువ విస్తీర్ణం, జీప్లస్ 2 కంటే ఎక్కువ అంతస్తులు ఉండే ప్లాట్లలో నివాసేతర భవనాలకు సింగిల్‌విండో పద్ధతుల్లో అనుమతులు ఇస్తారు. ఎన్వోసీ కోసం ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తులను పరిశీలించి 21 రోజుల్లో అనుమతి ఇస్తారు. ఏదైనా కారణంతో ఆ గడువులోపు అనుమతులు రానిపక్షంలో దరఖాస్తుదారుడు అనుమతి వచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది. 22వ రోజు ఆన్లైన్లో అనుమతి పత్రం పొందవచ్చు.
సులభంగా అనుమతులు
టీఎస్‌బీపాస్ ద్వారా భవన ని ర్మాణాలకు అనుమతులు సులభంగా పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణాల అ నుమతులు పారదర్శకంగా ఉం డేందుకు టీఎస్‌బీపాస్ విధానా న్ని తీసుకొచ్చింది. ఇంటి నుంచే దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందే వీలుంది. అయితే ప్రభుత్వం సూచించిన ప్రకారం నిబంధనలు పాటించాలి. తనిఖీ బృందాలు భవన నిర్మాణాన్ని పరిశీలిస్తాయి. ఆ సమయంలో డీవియేషన్లు ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు పొందుపరిస్తే భవన నిర్మాణాల అనుమతులు నిర్ణీత గడువులోగానే పొందుతారు. లేఅవుట్ అనుమతులు కూడా సులువుగా పొందే అవకాశం ఉంది. ప్లాట్లు కొనుగోలు చేసే వారు లే అవుట్ అనుమతులు ఉన్న ప్లాట్లనే కొనుగోలు చేయాలి. లేకుంటే నిర్మాణ అనుమతుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
– అమరేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఆదిబట్ల
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

