దిద్దు బాట
కేసీఆర్ పాలనలో ఎటు చూసినా పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. పరిశుభ్రమైన పరిసరాలతో చూడముచ్చటగా ఉన్న పల్లెల్లో నేడు ప్రగతి కళ తప్పింది. కాంగ్రెస్ సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో ‘పల్లె ప్రగతి’ పడకేసింది. నిర్వహణ చేయలేక పంచాయతీ అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
- పల్లె కళ.. పగటి కల
- గత ఆరునెలలుగా నిర్వహణలేక అస్తవ్యస్తంగా మారిన ప్రగతి పనులు
- ప్రజల్లో వ్యతిరేకతతో చర్యలకు దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ప్రభుత్వ ఆదేశాలతో పల్లెబాట పట్టిన అధికారులు..
- క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రగతి పనులపై ఆరా.. ప్రభుత్వానికి నివేదన
- నిర్లక్ష్యం వహించిన ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
కేసీఆర్ పాలనలో ఎటు చూసినా పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. పరిశుభ్రమైన పరిసరాలతో చూడముచ్చటగా ఉన్న పల్లెల్లో నేడు ప్రగతి కళ తప్పింది. కాంగ్రెస్ సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో ‘పల్లె ప్రగతి’ పడకేసింది. నిర్వహణ చేయలేక పంచాయతీ అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. పల్లె పాలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్వహణలేక అస్తవ్యస్తంగా మారిన ప్రగతి పనుల లక్ష్యం నెరవేర్చేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిపై వాస్తవ పరిస్థితులను తెలుసుకుని నివేదిక అందించాలని అధికారులను పురమాయించింది. ఈ మేరకు అధికారుల బృందాలు గ్రామ పంచాయతీల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు వెబ్సైట్లో నమోదు చేస్తున్నాయి. నిర్లక్ష్యం కనబర్చిన అధికారులకు షోకాజ్ నోటీసులను జారీ చేసి పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు.
-రంగారెడ్డి, మే 30(నమస్తే తెలంగాణ)
పల్లెల్లో పచ్చదనం పెంచడానికి, ఆహ్లాద వాతావరణం కల్పించడానికి జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో పెద్ద ఎత్తున పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు తీర్చడానికి వైకుంఠధామాలను నిర్మించింది. పంచాయతీల ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త విడిగా సేకరించి సేంద్రియ ఎరువు తయారీ కోసం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. అలాగే గ్రామీణుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఎంతో సదాశయంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు..కొత్త ప్రభుత్వంలో నిస్తేజంగా మారాయి. నిధుల కొరతతో నిర్వహణ సైతం అటకెక్కింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలావరకు ప్రగతి నిర్మాణాలను ప్రజలు వినియోగించుకునే స్థితిలో లేవు. రూ.కోట్ల నిధులు వెచ్చించి నిర్మించిన నిర్మాణాలు నిరుపయోగంగా మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రస్తుతం ఆయా నిర్మాణాలు ఏయే దశలో ఉన్నాయనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని మండల అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎంపీడీవోలు, కార్యదర్శులు పల్లె ప్రగతి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను రూపొందిస్తున్నారు. వైకుంఠధామాల్లో తాగునీరు, కరెంటు సౌకర్యాల పరిస్థితి ఏమిటి? పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఎన్ని? ఎని బతికాయి అన్న విషయాలను పరిశీలించి ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణను విధిగా సేకరించేలా ఆదేశాలను జారీ చేస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లాలో పనుల పరిశీలన కొనసాగుతుండగా డీపీవో సురేశ్, డీఎల్పీవోలు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షిస్తున్నారు.
షోకాజ్ నోటీసులు జారీ..
జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పాలన ఈ ఏడాది జనవరితో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించక ప్రత్యేకాధికారులను నియమించి ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక పాలనను కొనసాగిస్తున్నది. 252 మంది గెజిటెడ్ అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేక పాలనలో ప్రగతి పడకేసింది. పర్యవేక్షణ కొరవడి హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగినప్పటికీ వాటిని తొలగించే పరిస్థితి లేకుండా పోయింది. పారిశుధ్యం సైతం అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ప్రగతి పనుల సందర్భంగా నిర్లక్ష్యం వహించిన అధికారులపై జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పటివరకు ముగ్గురు ఎంపీడీవోలు, ఎనిమిది మంది గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు.
నిర్వహణ లోపం ఉంటే చర్యలు తీసుకుంటున్నాం : సురేశ్, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలో ఇప్పటివరకు ఎనభై శాతానికిపైగా గ్రామ పంచాయతీల్లో ప్రగతి పనుల పరిశీలన పూర్తయ్యింది. రెండు, మూడు రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో పరిశీలన పూర్తవుతుంది. వాస్తవ పరిస్థితులను పరిశీలించి వెబ్సైట్లో నమోదు చేస్తున్నాం. నిర్వహణ లోపాలు ఏమైనా ఉంటే గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నాం. నిర్లక్ష్యం కనబర్చిన ముగ్గురు ఎంపీడీవోలు, ఎనిమిది మంది గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులను జారీ చేశాం.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

