చేవెళ్ల రూరల్, మే 22 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల్లో వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులకు గురైన గ్రామాలు.. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. అందుకు నిదర్శనం మండలంలోని ఈర్లపల్లి గ్రామం. ఈ ఊరిలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, ఇంటింటికీ మిషన్ భగీరథ నీటితోపాటు పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రభుత్వం మంజూ రు చేస్తున్న నిధులతోపాటు గ్రామ పంచాయతీ ప్రత్యేక నిధులతో గ్రామాభివృద్ధికి సర్పంచ్ ముత్తంగి రాజశేఖర్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ రమేశ్‌బాబు, వార్డు సభ్యులు ఎంతో కృషి చేస్తున్నారు. గ్రామం లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఊరిలో 902 జనాభా ఉండగా 749 మంది ఓటర్లు ఉన్నారు.
పూర్తైనపల్లె ప్రగతి పనులు..
ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో గ్రామంలో వైకుంఠధామం, హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి వనం, చెత్త డంపింగ్ యార్డు తదితర ప్రగతి పనులను చేపట్టారు. గ్రామాన్ని ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రంగా ఉంచుతున్నారు. ఉదయమే ఇం టింటికీ తిరిగి తడి, పొడి చెత్తను వేరు చేసి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఆ ఎరువును హరితహారం నర్సరీలో ని మొక్కలతోపాటు పల్లెప్రకృతివనం మొ క్కలను వినియోగిస్తున్నారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా హరితహారంలో భా గంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రా మానికి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామంలో ఏ వీధిని చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావర ణం కనిపిస్తున్నది. అంతేకాకుండా గ్రామం లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఇం టింటికీ ఆరు మొక్కల చొప్పున గ్రామస్తుల కు సర్పంచ్, ఉప సర్పంచ్ పంపిణీ చేశారు.
గ్రామాభివృద్ధికి కృషి ..
పల్లె ప్రగతి నిధులతో గతంలో గ్రామంలో పేరుకుపోయిన పలు సమస్యలను పరిష్కరించాం. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. హరితహారం మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అధికారుల సూచనలతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నా.
– రమేశ్‌బాబు, పంచాయతీ సెక్రటరీ,
ఈర్లపల్లి గ్రామం ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
పల్లెప్రగతి కార్యక్రమం గ్రామ రూపురేఖలను మార్చింది. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో ప్రజలకు అవసరమైన పనులను చేపడుతున్నా. ఇప్పటికే అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం వంటి పలు అభివృద్ధి పనులను పూర్తి చేశా. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో గ్రామా న్ని మరింత అభివృద్ధి చేసి మండలంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
– ముత్తంగి రాజశేఖర్, ఈర్లపల్లి గ్రామ సర్పంచ్