కడ్తాల్, ఫిబ్రవరి 18 : మండల కేంద్రంలో కొలువైన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు ఏడు రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకు లు, ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నా రు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రధాన పురోహితుడు వెంకటేశ్వరశర్మ పర్యవేక్షణలో ఆలయ అనువంశీక అర్చకులు రఘురాం, వేణుగోపాల్, శ్రీధర్, శ్రీమన్నారాయణ, వెంకటేశ్, కృష్ణ, నర్సింహ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొననున్నారు.
ఫిబ్రవరి 20న స్వసి ్తపుణ్యాహవాచనం, విష్వక్సేన పూజ, అఖండ దీపారాధన, ధ్వజారోహణం, అంకురార్పణ, 21న అమ్మవారికి ప్రత్యే క పూజలు, లలితాసహస్రనామ పారాయణం, రాత్రివేళల్లో స్వామి వారి ఎదురుకోళ్లు, 22న ఉదయం ఆలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం స్వామి వారి కల్యాణం, రాత్రి భజన కార్యక్రమాలు, తెల్లవారుజామున 3 గంటలకు శివాలయం దగ్గర అగ్ని గుండాలు, 23న ఉదయం లక్షపుష్పార్చన, స్వామి వారికి ప్రత్యే క పూజలు, విష్ణుసహస్రనామ పారాయణం, రాత్రివేళల్లో పుష్పమాల సేవ (చిన్నతేరు), కడ్తాల్ భజన బృందంచే హనుమాన్ చాలీసా పఠ నం, భజన కార్యక్రమాలు, 24న ప్రత్యేక కుంకుమార్చనతో సహస్రనామ పారాయణం, రాత్రి బ్రహ్మ రథోత్సవం (పెద్దతేరు), 25న హనుమాన్ చాలీ సాపఠనం, పారాయణం, ఆకుపూజలు, పారిజాత పుష్పార్చన, 26న అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, మధ్యా హ్నం చక్రతీర్థం, స్వామివారిని గరుడసేవలో ఊరేగింపు, రాత్రి నాగవ ల్లి నిర్వహణతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్లు వేణుగోపాల్, ఆంజనేయులు, ప్రధాన అర్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలన్నారు.
మక్తమాదారం గ్రామంలో కొలువైన రుక్మిణీసత్య భామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ఆలయంలో ఆలయ అనువంశీక అర్చకులు తిరుమల వింజమూరు రామానుజాచార్యులు, ఆదితాచార్యులు, నిత్య నిధి, మహాపూర్ణాహుతి, చక్రస్నానం, ధ్వజారోహణం, పుష్పాయాగం, తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు నర్సింహ, బీచ్చానాయక్, గౌడ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో వారం రోజులపాటు జరుగనున్న లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను ఆదివారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. వారిలో మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ వేణుగోపాల్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు రామచంద్రయ్య, అశోక్, రాజేందర్‌యాదవ్ ఉన్నారు.