మర్పల్లి, డిసెంబర్ 8: ఇండియన్ రెడ్‌క్రాస్ పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని తహసీల్దార్ శ్రీధర్ అన్నారు. వర్షాకాలంలో మండలంలోని వివిధ గ్రామాల్లో ఇండ్లు దెబ్బ తిన్న 11 మంది బాధితులకు టార్ఫాలిన్, వంటపాత్రల స్టీల్ సామాన్లు ఒక్కొక్కరికి రూ.ఐదు వేలు విలువ గల కిట్లను గురువారం తహసీల్దార్ కార్యాలయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ అందజేశారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తాదాన శిబిరాలు ఫస్ట్ ఎయిడ్పై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వ హించడంలో రెడ్‌క్రాస్ ముందుంటుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, ఆర్ఐలు దశరథ్, మాధవరెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి సాయి చౌదరి, జిల్లా కోశాధికారి డాక్టర్ సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.
మోమిన్‌పేట, డిసెంబర్ 8: వరదలు, విపత్తులు జరిగినప్పుడు బాధితులకు అందరి కంటే ముందు రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు అందిస్తుందని సొసైటీ కార్యదర్శి సాయి చౌదరి అన్నారు. గురు వారం మండల రెవెన్యూ కార్యాలయంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లు దెబ్బతిన్న నిరుపేదలకు తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వంట సామాగ్రి, హైజీనిక్ కిట్లను అంద జేశారు.