భూముల రక్షణకు టాస్క్‌ఫోర్స్..
రంగారెడ్డి జిల్లాలో భూములకు డిమాండ్ పెరగడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. చివరకు చెరువులు, గుట్టలను సైతం వదలడం లేదు.
- జిల్లాలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు మాయం
- అక్రమార్కుల చెరలో చెరువులు, కుంటలు
- ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనూ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు
- భూ ఆక్రమణలకు చెక్ పెట్టేలా కలెక్టర్ శశాంక చర్యలు
- జిల్లాలో ఆక్రమణల తొలగింపునకు రెండు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటు
- త్వరలోనే మొదలుకానున్న కార్యాచరణ
రంగారెడ్డి, జూలై 16(నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో భూములకు డిమాండ్ పెరగడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. చివరకు చెరువులు, గుట్టలను సైతం వదలడం లేదు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని భూములను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా జిల్లాలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రంగారెడ్డి కలెక్టర్ శశాంక ప్రభుత్వ భూములపై నజర్ పెట్టారు. వాటి పరిరక్షణ దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే వివిధ శాఖల అధికారులతో రెండు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ త్వరలోనే మొదలుకానుండగా.. ఆయా బృందాలు ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టనున్నాయి.
కబ్జాకు కాదేదీ అనర్హం..
జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో మారుమూల ప్రాంతంలోనూ వంద గజాల స్థలం రూ.20లక్షల నుంచి రూ.కోట్లలో ధర పలుకుతున్నది. రేట్లు ఆకాశన్నంటడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లు.. అసైన్డ్, భూదాన్, పొరంబోకు, అటవీ.. భూముల్లో కబ్జా కాండను సాగిస్తున్నారు. చెరువులు, కుంటలు సైతం ఆక్రమణదారుల గుప్పిట్లో బందీ అయ్యాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వంటి పరిధిలోని స్థలాలకు సైతం అధికారులు ఎన్వోసీ, ఎల్పీ నంబర్లను జారీ చేస్తుండడంతో నీటి వనరుల ఆనవాళ్లే లేకుండా పోతున్నాయి. అధికారుల ఉదాసీనత కారణంగా ఇప్పటికే రూ.కోట్ల విలువైన ఎన్నో భూములు ఆక్రమణదారుల చెరలో చిక్కుకున్నాయి. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, శంషాబాద్, గోపన్‌పల్లి తదితర ప్రాంతాల్లో భూములకు ఉన్న డిమాండ్ తరహాలోనే ఆక్రమణలు సైతం ఉంటున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే బాగోతం.. చాలా చోట్ల వీటి వెనుక కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారుల అండదండలతో భూ దందా నిర్విఘ్నంగా కొనసాగుతున్నదని విమర్శలున్నాయి. మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన చోట్ల జీపీ పర్మిషన్లతో అక్రమ తంతును సాగిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పటిష్ట కార్యాచరణతో ఆక్రమణల గుర్తింపు..
ఇకపై ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవ్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టే దిశగా అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్న కబ్జాదారులపై కలెక్టర్ శశాంక ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదేరీతిన కఠినంగా ఉండాలని ప్రతి సమావేశంలోనూ రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచిస్తున్నారు. ఓ పక్క జియోట్యాగింగ్‌తో ప్రభుత్వ భూముల హద్దులను ఖరారు చేసే ప్రక్రియ జిల్లాలో కొనసాగుతుండగా.. తాజాగా ఆక్రమణలను నిరోధించేందుకు స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్, ఏసీపీ స్థాయిలో రెండు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు ఒక బృందాన్ని, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, షాద్ నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్, హెచ్ఎండీఏ లేక్స్, పంచాయతీ, విద్యుత్, సర్వే సిబ్బంది తదితర అధికారులు టాస్క్‌ఫోర్స్ బృందంలో ఉంటారు. అక్రమార్కుల చెర నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి కల్పించేందుకు ఈ బృందాలు పటిష్ట కార్యాచరణను అవలంబించనున్నాయి. ఆయా బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిల్లోని ఆక్రమణలను గుర్తించి అవసరమైన చర్యలను వెంటనే అమలు చేస్తారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువగా ఆక్రమణలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార దిశగా సంబంధిత బృందాలు కార్యాచరణను మొదలుపెట్టనున్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

