తాండూరు : తాండూరు కందిపప్పుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ శాతం రైతులు కందిపంటనే సాగు చేస్తున్నారని అందుకు తగ్గట్లు తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని సీఎంతో సహా సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రులు కందిబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. తాండూరు కందిపప్పుకు జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందని గుర్తు చేస్తు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.