వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి.. సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు, సంక్షేమ శాఖల మంత్రి సీతక అన్నారు.
- వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
రంగారెడ్డి, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి.. సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు, సంక్షేమ శాఖల మంత్రి సీతక అన్నారు. సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీజనల్ వ్యాధులపై వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వర్షాకాలం ప్రారంభమైనందున వర్షాలు, వరదలతో నష్టం కలుగకుండా ముందస్తుగా శిథిలమైన, కూలిపోయేస్థితిలో ఉన్న ఇండ్ల ను గుర్తించి వెంటనే కూల్చివేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి వరదల తాకిడికి నివాస గృహాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజన్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయాలన్నారు.
మంచినీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ ద్వారా శుభ్రపర్చాలని, పారిశుధ్య పనులపై ప్రత్యే క శ్రద్ధ వహించి చెత్త కుప్పలు, మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిణి శ్రీలత, డీపీవో సురేశ్మెహన్, మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

