ఆమనగల్లు, ఫిబ్రవరి 15: మండలలోని శెట్టిపల్లిలో వెలిసిన అలివేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్ర్తాలు సమర్పించి కల్యాణోత్సవాన్ని మాజీ సర్పంచ్ గోదాదేవి ఆధ్వర్యంలో అర్చకులు నవీన్ శర్మ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ జిల్లా నాయకుడు సత్యం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అర్జున్‌రావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వారిని మాజీ సర్పంచ్ గోదాదేవి సన్మానించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలు హాజరయ్యారు. జాతర ఉత్సవాలను పురస్కరించుకొని వాలీబాల్ టోర్నమెంట్‌ను మాజీ సర్పంచ్ గోదాదేవి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీనివాసులు, స్థానికులు జగన్, శ్రీను, జంగయ్య చారీ, కృష్ణప్రసాద్, కృష్ణారావు, చంద్రమౌళి, ప్రసాద్, నర్సింహ పాల్గొన్నారు