అమ్మవారికి ప్రత్యేక పూజలు

షాద్నగర్టౌన్ : శ్రావణ మాసం నాగుల, గరుడ పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని ఆయా దేవాలయా ల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగిరోడ్డు పోచమ్మ దేవాలయం ఆవరణలోని పుట్ట వద్ద శుక్రవారం మహిళలు, యువతలు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి దేవాలయం వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారులు తీరారు.
అదే విధంగా పుట్ట వద్ద భక్తులు పాలు, కోడిగుడ్లు, పిండి పదార్ధాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గరుడ పంచమిని పురస్కరించుకుని షాద్నగర్ మున్సిపాలిటీలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎదురుగా ఉన్న గరుడ దేవుడికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

