ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలి
ప్రస్తుత రోజుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పిలుపునిచ్చారు.
- రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 1: ప్రస్తుత రోజుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలను కూడా తెలుసుకోగలగాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ భూగోళ శాస్త్ర విభాగం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ జా గ్రఫర్స్ (ఐఐజీ) సంయుక్తంగా ఐఐజీ 43 వ వార్షిక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ‘చాలెంజెస్ ఆఫ్ ఫ్యూచర్ ఎర్త్ – సోష ల్, ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టెయినబిలిటీ’ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఓయూలోని పీజీఆర్ఆర్సీడీఈ ఆడిటోరియం లో గురువారం నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ లింబాద్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) 2030 నాటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఒకటైన అంశంపై సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. భూపరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. కార్యక్రమంలో ఇన్కాయిస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసకుమార్, ప్రముఖ శాస్త్రవేత్త, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వైవీఎన్ కృష్ణమూర్తి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఐఐజీ సెక్రటరీ ప్రొఫెసర్ రవీంద్ర జయబేయి, సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ బాలకిషన్, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీనగేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మహ్మద్ అక్తర్ అలీ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

