తలకొండపల్లి : రైతులకు పండ్లతోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సహకాన్ని ఇస్తుందని రైతులు పండ్లతోటల పెంపకంపై దృష్టి సారించాలని ఉద్యానవనశాఖ అధికారిణి ఉషారాణి అన్నారు. గురువారం తలకొండపల్లి గ్రామంలో రైతులు విఠల్, నర్సమ్మ, యాదగిరి సాగుచేసిన బొప్పాయతోటను పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ హైదరాబాద్ పట్టణానికి తలకొండపల్లి మండల రైతులు దగ్గరగా ఉన్నారని పండ్ల తోటల పెంపకానికి ఇక్కడి భూములు అనువుగా ఉండటంతో దృష్టి పెట్టాలని సూచించారు. తోటల పెంపకంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సెంద్రీయ ఎరువులు వాడాలని సూచించారు.
తోటలకు తెగుళ్లు రాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో రైతులు విఠల్, యాదగిరి, తిరుపతి, అలివేలు ఉన్నారు.