కడ్తాల్, మే 29 : సంఘ సంస్కర్త మహాత్మా బసవేశ్వరుడి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం ఆమనగల్లు మండలంలోని అయ్యసాగర క్షేత్రంలో వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర 889వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, రాయచూర్ మఠానికి చెందిన 108 షట్ బ్రహ్మ శాంతమల్లా శివాచార్యస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
బసవేశ్వరుడు సమాజంలో కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ప్రజలందరినీ కులమతాలకతీతంగా ఏకం చేసిన బసవేశ్వరుడి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బసవేశ్వరుడి బోధనలు, ప్రవచనాలను పాటించి సన్మార్గంలో నడువాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుడికి ప్రాధాన్యతను కల్పిస్తూ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.
అనంతరం వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, హారతి, పూజలు జరిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, సోనా, ఎంపీటీసీలు సరిత, లచ్చిరాంనాయక్, పత్యానాయక్, మల్లప్ప, సర్వేశ్వర్, లింగప్ప, భాస్కర్‌రెడ్డి, హన్మ్యానాయక్, సురేందర్‌రెడ్డి, వీరయ్య, సుభాశ్, శ్రీను, గౌరీశంకర్, జగదీశ్వర్, ఈశ్వరప్ప, శరణుబసప్ప, శేఖర్అయ్యగారు, ప్రేమ్‌కుమార్, జ్ఞానేశ్వర్, నర్సిరెడ్డి, పంచాక్షరి, శ్రీనునాయక్, పంతూనాయక్, వెంకటేశ్, మల్లేశ్, మల్లికార్జున్, సుభాశ్, ప్రభులింగం, రమేశ్, సంతోశ్, అనిల్ పాల్గొన్నారు