ధారూరు, మే 29 : కాంగ్రెస్ పార్టీ ధారూరు మండల అధ్య క్షుడు రఘువీరారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు హెచ్చరించారు. ఆది వారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్శంగా వారు మాట్లా డు తూ వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాలని ఏదైనా ఉంటే పార్టీ అభివృద్ధి అంశాలపై చర్చించాలన్నారు. మరో సారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మండలంలో తిరుగనివ్వమని వారు హెచ్చరించారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏమి అభివృద్ధి చేశారని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజూనాయక్, ప్రధాన కార్యదర్శులు కావలి అంజయ్య, రాములు, పార్టీ మాజీ అధ్య క్షుడు వేణు గోపాల్ రెడ్డి, ఏఈఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంతోష్‌కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వీరేశం, ధారూరు సర్పంచ్ చంద్రమౌళి, రైతు బంధు సమితి మండల కమిటీ అధ్యక్షుడు వెంకటయ్య, మండల యువజన విభాగం అధ్య క్షుడు జైపాల్ రెడ్డి, నాయకులు వెంకట్ రామ్ రెడ్డి, లక్ష్మయ్య, రవీందర్ నాయక్, నర్సింహులు, చెన్నయ్యగౌడ్, చిన్నయ్య గౌడ్, విజయ్‌కుమార్, వెంకటయ్య పాల్గొన్నారు.