తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముస్తాబైంది. కలెక్టరేట్ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. అవతరణ వేడుకల సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటలకు కలెక్టర్ శశాంక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.