శాంతియుత వాతావరణంలో.. ఎన్నికలను నిర్వహించాలి
రానున్న అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డి.అమోయ్‌కుమార్ అధికారులకు సూచించారు.
- నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు
- సైబరాబాద్, రాచకొండ సీపీలు స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్
సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): రానున్న అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డి.అమోయ్‌కుమార్ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణపై రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, అధికారులతో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు హరీశ్, అమోయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు టీమ్ వర్క్‌తో సమష్టిగా కలిసి పనిచేయాలన్నారు. భారత ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం నడుచుకోవాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రజలు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెండు కమిషనరేట్ల పరిధిలో ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు సృష్టించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని సకాలంలో గుర్తించి, కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా సోషల్ మీడియా బృందాలను నియమించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, విధులపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఎన్నికలను ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలో వివరించారు. అనంతరం సైబరాబాద్ క్రైమ్ డీసీపీ సింగేన్వార్ కల్మేశ్వర్ ఎన్నికల నిర్వహణలో వల్నరెబిలిటి మ్యాపింగ్ ఎక్సర్సైజ్ను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

