నుమాయిష్ చరిత్ర ఎంతో ఘనం
నుమాయిష్‌కు ఎంతో చరిత్ర ఉందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం అభినందనీయమని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్, భరోసా సెంటర్, షీ టీమ్స్ స్టాల్స్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం స్టాల్లలో ఏర్పాటు చేసిన చిత్రాలను తిలకించారు
- నగర సీపీ సీవీ ఆనంద్.. నుమాయిష్‌లో ట్రాఫిక్, భరోసా, షీటీమ్స్ స్టాల్స్ ప్రారంభం
సుల్తాన్‌బజార్, జనవరి 11 : నుమాయిష్‌కు ఎంతో చరిత్ర ఉందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం అభినందనీయమని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్, భరోసా సెంటర్, షీ టీమ్స్ స్టాల్స్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం స్టాల్లలో ఏర్పాటు చేసిన చిత్రాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న నాటి నుంచే నుమాయిష్‌తో తనకెంతో అనుభంధం ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నుమాయిష్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు ఇంత పెద్ద స్టాల్‌ను కేటాయించిన ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులకు సీపీ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి అవగాహన స్టాల్స్‌తో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. పోలీస్ స్టాల్స్‌ను నుమాయిష్‌కు వచ్చే సందర్శకులు తప్పకుండా సందర్శించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, అడిషనల్ సీపీ, లా అండ్ ఆర్డర్ విక్రమ్, జాయింట్ సీపీ ఏసీబీ విశ్వ ప్రసాద్, సిట్, క్రైం అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

