Parigi : చేపల వేటకు వెళ్లి.. చెరువులో గల్లంతు

చెరువులో గల్లంతు
పరిగి టౌన్ : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో గల్లంతైన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని మిట్టకోడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాకి ప్రభు (35), మల్లేశ్, రమేశ్, నర్సింలుతో కలిసి సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో వలలు కట్టి వచ్చారు. మంగళవారం ఉదయం చేపల కోసం వలలు కట్టిన వారిలో ముగ్గురు వెళ్లగా గట్టుపై కాకి ప్రభు చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో వారు కాకి ప్రభు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు.
సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చేపల కోసం చెరువు వద్ద వలలు కట్టామని వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడని వారు వివరించారు. ప్రభుకు భార్య సుమిత్ర, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రామస్తులతో కలిసి చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడిందని ఎస్సై క్రాంతికుమార్పాటిల్ తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

