నానక్‌రాంగూడకు ఎంఆర్డీసీ ఆఫీస్
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీ) కార్యాలయాన్ని నానక్‌రాంగూడకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీ) కార్యాలయాన్ని నానక్‌రాంగూడకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తార్నాకలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కార్యాలయంలో కొనసాగుతున్న కార్యాలయాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్ఎండీఏ జోనల్ కమిషనర్ ఆమ్రపాలి నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్)లోని కార్యాలయంలోని పలు చాంబర్లు, ఆఫీస్ స్పేస్‌ను పరిశీలించారు. హెచ్‌జీసీఎల్ కార్యాలయంలోని అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఎంఆర్డీసీ కార్యాలయ ఏర్పాటుపై చర్చించారు. ఇక్కడి రెండు భవనాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన ఫర్నిచర్‌ను సమకూర్చి, ఉన్నతాధికారులకు అవసరమైన చాంబర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- hmda
- MRDC Office
- Nanakranguda
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

